Cinema: ‘ధ‌గ‌డ్’ ఆగ‌యా.. నాని సినిమా అప్‌డేట్ వచ్చేసింది!

cinema nani paradise

Share this article

Cinema: హిట్ 3తో సూప‌ర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని మ‌రో సెన్సేష‌న్ క‌థ‌తో రాబోతున్నారు. ద‌స‌రా సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన యంగ్ సెన్సేష‌న్ శ్రీకాంత్ ఓదెలా మ‌రోసారి నానితో జ‌త క‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి అనౌన్స్‌మెంట్ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. సినీ ప్రియుల నుంచి మంచి స్పంద‌న వచ్చింది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన మ‌రో అప్‌డేట్‌ను పంచుకుంది చిత్ర‌బృందం. ధ‌గ‌డ్ ఎంట్రీ అంటూ ఈ సినిమా సెట్స్‌లోకి నాని ఎంట‌ర్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది (2026) మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. యాక్ష‌న్ థ్రిల్లింగ్ క‌థాంశంతో వ‌స్తున్న ఈ చిత్రం ఏమేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *