Business: ఒక్కప్పుడు “బిజినెస్” అంటే భారీ ఫ్యాక్టరీలు, వస్తు తయారీ, అమ్మకాల కేంద్రాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు..? మీ ఇంట్లో కూర్చొని చూస్తున్న ఓటీటీ సిరీస్, ఆడుతున్న మొబైల్ గేమ్, ఆర్డర్ చేసిన డ్రెస్సు – ఇవన్నీ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న వ్యాపారాలు. జనం సాధారణ హాబీలే బిజినెస్‌గా మారిపోయిన ఈ కొత్త ట్రెండ్‌ను వ్యాపార విశ్లేషకులు “అటెన్షన్ ఎకానమీ” (Attention Economy) అంటున్నారు.
ఏంటీ అటెన్షన్ ఎకానమీ..?
డిమాండ్, సప్లై గురించి అందరికీ తెలిసిందే. ఎక్కడ ఎక్కువ మంది వినియోగదారులు ఉంటారో అక్కడ వ్యాపారాన్ని మొదలుపెట్టలనేది బేసిక్ రూల్. అయితే, ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లే బిజినెస్ రంగమూ రూపాంతరం చెందుతోంది. కొందరి టైం.. ఇంకొందరికి మనీగా మారుతోంది. నెలకు రూ.కోట్లు ఆర్జించి పెడుతోంది. జనం అటెన్షన్‌ని తమవైపు తిప్పుకుని కూర్చున్న చోట నుంచే డబ్బులు పోగేయడమే అటెన్షన్ ఎకానమీ. భారత్ దేశమే కాదు ప్రపంచమంతా ఇప్పుడిదే ట్రెండింగ్ మరియు టాప్ బిజినెస్ అని నిపుణులు చెబుతున్నారు.
ఎలా..?
📺 1. Netflix – ప్రతి కుటుంబంలో ‘ఓటీటీ’ బిజినెస్
ప్రస్తుతం భారత్‌లో 12 కోట్ల మందికి పైగా ఓటీటీ యూజర్లు ఉన్నారు. అందులో కూడా 4 కోట్ల మంది నెలకు కనీసం ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు.
Netflix ప్లాన్లు: ₹199 నుంచి ₹649/month
ఈ కంపెనీ ఒక్క భారత్ నుంచే 2024లో రూ. 3500 కోట్లకు పైగా ఆదాయం సంపాదించింది
తెలుగు ప్రేక్షకుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒరిజినల్ వెబ్ సిరీస్ లైనప్ ప్లాన్ చేస్తున్న Netflix, Hotstar
👉ఒక చిన్న ఫ్యామిలీ ఇంట్లో ఓ గంటసేపు సీరియల్ చూస్తుంటే.. వాళ్లు వినోదం పొందుతారు. అదే గంటలో రూ.కోట్లు సంపాదిస్తోంది Netflix

🎮 2. Dream11, WinZO, MPL – గేమింగ్‌లో కోట్లూ.. సెకన్లలో!
కరోనా తరువాత ఇండియాలో Mobile Gaming రంగం గగనాన్ని తాకింది. ఎక్కువగా యువత అటెన్షన్ ని క్యాష్ చేసుకుంటూ రంగంలోకి దిగాయి ఈ గేమింగ్ యాప్స్.
Dream11: 2024లో ₹6,400 కోట్ల టర్నోవర్
MPL: రూ. 1,300 కోట్లకు పైగా వృద్ధి
RummyCircle, WinZO – రోజుకు సగటున 30 లక్షల యాక్టివ్ యూజర్లు
👉IPL చూసేటప్పుడు చాలామంది Dream11 గేమింగ్‌లో పాల్గొంటున్నారు. టీవీలో మ్యాచ్ చూస్తూ ఫోన్లో గేమ్ ఆడటం – ఇది వినోదమా? వ్యాపారమా? రెండూ!
🛍️ 3. Meesho, Flipkart – Instagram స్క్రోల్ చేస్తూ షాపింగ్!
మీ ఇంట్లో ఉన్నవాళ్లు Instagram రీల్స్ చూస్తూ ఉన్నారా? అక్కడే ఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ కనిపించాక వాటిని Meesho, Flipkart, Amazonలో ఆర్డర్ చేస్తారు.
Meesho: 2024లో ₹9,700 కోట్ల GMV
85% మంది వినియోగదారులు మొబైల్ నుంచే షాపింగ్
Instagram Shops ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపు అవుతోంది
👉ఇంట్లో కూర్చున్నవాళ్లు స్క్రోల్ చేస్తూ షాపింగ్ చేస్తారు. కంపెనీలు అదే స్క్రోల్‌ను స్కీమ్‌గా మార్చి లాభాన్ని రాబడతాయి!
💄 4. Makeup & Lifestyle YouTubers – ఇంటి నుంచి లక్షల్లో ఆదాయం!
మీ ఇంట్లో ఎవరైనా YouTubeలో మేకప్ ట్యుటోరియల్స్ చూస్తుంటే.. అవి కూడా వ్యాపారమే.
నిఖిలా జవేరి, ష్రుతి అరోరా లాంటి Influencers నెలకు ₹3 లక్షలకిపైగా బ్రాండ్ డీల్స్ ద్వారా సంపాదిస్తున్నారు
ప్రతి వీడియోకు 3-5 స్పాన్సర్డ్ బ్రాండ్లు ఉంటున్నాయి
Amazon & Nykaa నుండి కమీషన్ కూడా తీసుకుంటారు
👉 వీరు వీడియోలు చేసేది ఇంట్లో.. కానీ వారికి వచ్చే ఆదాయం MNC ఉద్యోగాల కన్నా ఎక్కువ!
ఇవన్నీ వ్యాపారం కాకపోతే మరేంటి?
ఇప్పటి వ్యాపార మంత్రం చాలా సింపుల్ – “ఎక్కడ ప్రజల టైమ్ ఎక్కువగా ఖర్చవుతుందో, అక్కడే వ్యాపారం ఎక్కువగా రాబడుతుంది!” మీ ఇంట్లో ఒకవైపు పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారు, మరోవైపు మీసోలో అమ్మాయిలు షాపింగ్ చేస్తున్నారు, పెద్దలు ఓటీటీ చూస్తున్నారు… ఈ చిన్న చిన్న హాబీలు కంపెనీలకు రోజుకు కోట్ల రూపాయల లాభాలను తీసుకొస్తున్నాయి.
ఈ రంగాలే ఇండియా భవిష్యత్ బిజినెస్ లీడర్లు!
భారతదేశంలో 2025 నాటికి OTT మార్కెట్ విలువ: ₹20,000 కోట్లు
గేమింగ్ మార్కెట్ టార్గెట్: ₹40,000 కోట్లు
సోషల్ కామర్స్: ₹50,000 కోట్ల GMV లక్ష్యం
👉 ఇవి చిన్న విషయాలు కావు. ఎవరు ముందు ఆలోచిస్తే – వాళ్లే రేపటి లీడర్లు!
మీ ఇంట్లో ఉన్న మొబైల్, టైమ్, టాలెంట్‌ను సరిగా వాడుకుంటే.. మీరు కూడా ఈ Attention Economyలో ఒక భాగం కావచ్చు!