
BIS Recruitement 2025: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్ – BIS) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల(Engineering Graduates) కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో అర్హులైన విద్యార్థులను రూ.1,15,000 నెల జీతంతో సైంటిస్ట్-బీ పోస్టులకు ఎంపిక చేయనుంది. ఈమేరకు మే 3న నోటిఫికేషన్ విడుదల చేసిన బీఐఎస్.. ఆన్లైన్లో ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
మొత్తం 20 సైంటిస్టు-బీ, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు భర్తీ చేస్తుండగా.. ఇందులో సివిల్ ఇంజినీరింగ్కి అత్యధికంగా 8 పోస్టులున్నాయి. మే 23 అర్ధరాత్రి 11:59గంటలలోపు దరఖాస్తు పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఏదేనీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వూ సమయం నాటికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ప్రకటించింది బీఐఎస్.

ఎన్ని పోస్టులు: 20
ఎవరు అర్హులు: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యునికేషన్స్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. 2023, 2024, 2025 సంవత్సారలకు సంబంధించిన వాలిడ్ గేట్ స్కోరు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులకు సూచనలు: దరఖాస్తు చేసే ముందు బీఐఎస్ నోటిఫికేషన్లో సూచించిన విధంగా ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్, గేట్ స్కోర్ కార్డు, ఆధార్ కార్డు, డిగ్రీ మెమో(ఇంజినీరింగ్ ఫైనల్), కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వ్యక్తిగత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు తప్పనిసరి. భర్తీ ప్రక్రియ చివరి వరకూ ఇవే మీరు వాడుతూ ఉండాలి.
దరఖాస్తు ఇలా చేయండి..:
బీఐఎస్ అధికారిక వెబ్సైట్ www.bis.gov.in లో ‘Career Opportunities’ లోకి వెళ్లాక ‘Recruitment Advt./Result’ section రిక్రూట్మెంట్ విభాగంలో మే 3వ తేదీతో సైంటిస్ట్ బీ రిక్రూట్మెంట్ ప్రకటన ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తుదారులు వివరాలు నమోదు చేసుకొని దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందు బీఐఎస్ తో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ లాగిన్ వివరాలు గోప్యంగా ఉంచాలని బీఐఎస్ కోరుతోంది.
ఇక్కడ క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోండి : OGNews/BIS-Application