ISI మార్క్‌ అక్ర‌మంగా వినియోగం.. 36వేల వాట‌ర్ బాటిళ్లు సీజ్‌!

BIS Raid on Packaged Drinking Water Unit

Share this article

హైదరాబాద్, జూన్ 19, 2025: అనుమ‌తి లేకుండా ఐఎస్ఐ మార్కు(ISI Mark)ను ముద్రిస్తూ ప‌లు హోట‌ళ్లు, వాణిజ్య కేంద్రాల పేర్ల‌తో వాట‌ర్ బాటిళ్లు త‌యారు చేస్తున్న ఓ కేంద్రంపై బీఐఎస్ హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం మూసాపేట్‌లోని ఈ కేంద్రంపై దాడులు నిర్వ‌హించిన అధికారులు.. వేల సంఖ్య‌లో బాటిళ్లపై లైసెన్సు గ‌డువు ముగిసినా ఐఎస్ఐ ముద్ర వినియోగిస్తున్న‌ట్లు గుర్తించారు. ఇది BIS చట్టం, 2016 లోని సెక్షన్ 16 మరియు సెక్షన్ 17(3)కు ఉల్లంఘన కావ‌డంతో.. దాదాపు 13వేల‌ 500 ml వాటర్ బాటిల్స్, 8వేల ఒక లీట‌రు బాటిళ్లు, 15వేల 250 ఎంఎల్ బాటిళ్ల‌ను బీఐఎస్ అధికారులు జ‌ప్తు చేశారు.

ISI Mark products - BIS Raid on water unit

ఈ సంద‌ర్భంగా బీఐఎస్ జాయింట్ డైరెక్ట‌ర్ స‌విత మాట్లాడుతూ.. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాట‌ర్‌తో పాటు ఏ ఉత్ప‌త్తి అయినా బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ లేకుండా ఐఎస్ఐ ముద్ర వినియోగించ‌డం నేర‌మ‌న్నారు. త‌యారీదారులు బీఐఎస్ ధ్రువీక‌రణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత పలు ప‌రీక్ష‌లు, నియ‌మాలు పూర్త‌యిన త‌ర్వాతే వారికి లైసెన్సు మంజూరు చేస్తామ‌ని.. ధ్రువీక‌ర‌ణ లేకుండా ఐఎస్ఐ ముద్ర వాడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఐఎస్ఐ ముద్ర క‌నిపించ‌గానే వ‌స్తువులు కొనేయొద్ద‌ని.. వాటిపై ఉండే సీఎంఎల్ నెంబ‌రును బీఐఎస్ కేర్ యాప్‌(BIS CARE)లో ధ్రువీక‌రించుకున్న త‌ర్వాతే కొనుగోలు చేయాల‌ని సూచించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న‌ట్లు, న‌కిలీ ఐఎస్ఐ ముద్ర వాడిన‌ట్లు, త‌ప్ప‌నిస‌రి ధ్రువీక‌ర‌ణ‌లో ఉన్న ఉత్ప‌త్తులు ఐఎస్ఐ లేకుండా విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తిస్తే బీఐఎస్ కేర్ యాప్‌లో వెంట‌నే ఫిర్యాదు చేయాల‌ని ఆమె సూచించారు. వారిపై బీఐఎస్ వివిధ చ‌ట్టాల కింద క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *