Bigg Boss: బిగ్‌బాస్.. సీజన్ మొన్నే ముగిసినట్టుంది. అప్పుడే ఇంకో సీజన్ కూడా మొదలైపోతోంది. వాళ్లింట్లో ఏమవుతుందో పట్టించుకోని జనం సైతం ఈ బిగ్‌బాస్ ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోడానికి కిందామీదా పడిపోతుంటారు. ఒక్క క్షణం చూడటం మిస్ అయినా ప్రపంచమే మునిగిపోయిందన్న బాధ. అంతలా జనాలకు కనెక్ట్ అయింది బిగ్‌బాస్. అన్ని భాషల్లో హిట్ అయిన ఈ రియాలిటీ షో.. తెలుగులో మరీ ప్రత్యేకం. ఇతర భాషల్లో వచ్చే షోల కంటే ఎక్కువ మంది వీక్షకులు, అభిమానులు మన తెలుగు బిగ్‌బాస్‌కే ఉన్నారంటే ఎంతలా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోనే అత్యధిక వ్యూయర్షిప్‌తో తెలుగు బిగ్‌బాస్-8 సీజన్ చరిత్రే సృష్టించింది.
తెలుగింటి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 9 రానే వచ్చేసింది. ఇప్పటికే ఆడిషన్లు, ఇంటి సభ్యుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా.. ఈసారి సామాన్యులకూ అవకాశమిస్తున్నట్లు ఇటీవలె హోస్ట్ అక్కినేని నాగార్జున ఓ వీడియో ద్వారా ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సీజన్‌లో ఇంటి సభ్యులు వీళ్లేనంటూ పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొన్నింటిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. తరచూ వివాదాలతోనో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగానో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కొందరి పేర్లు దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురి పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.
ఈ నలుగురూ ఫిక్స్..?
బిగ్‌బాస్ గత సీజన్ లో రన్నరప్‌గా నిలిచిన నటుడు అమర్ దీప్ భార్య, నటి తేజస్విని గౌడ పేరు ఈ లిస్ట్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. అమర్ బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక ఇంటర్వ్యూలతో పాటు పలు రియాలిటీ షోలతోనూ ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. ఆమెతో పాటు ఏదో ఓ వివాదంతో తరచూ వార్తల్లో ట్రెండ్ అవుతుంది నటి కల్పికా గణేష్. ఇటీవల గచ్చిబౌలిలో ఓ పబ్ వివాదంలో మరోసారి తెరపై హాట టాపిక్‌గా మారారు. ఆమెకు సంబంధించిన బోల్డ్ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను కూడా ఈ సీజన్‌కి ఎంపిక చేసినట్లు సమాచారం.

వీరిద్దరితో పాటు అలేఖ్య చిట్టీ పికిల్స్ వివాదంతో సంచలనంగా మారిన మరో బోల్డ్ లేడీ రమ్య కూడా ఈసారి బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారట. అధిక ధరకు పచ్చళ్లు అమ్ముతున్నారంటూ పలువురు చేసిన కామెంట్లకు బూతులతో సమాధానమిచ్చింది ఈ బ్యూటీ. వినడానికి కూడా చిర్రెత్తించే ఆ బూతుల ఆడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాదాపు ఓ రెండు నెలలు సోషల్ మీడియా అంతా అదే రచ్చ. అయితే, ఈ వివాదంతో లైమ్‌లైట్‌కి కాస్త దూరంగా ఉన్న రమ్య.. ఉన్నట్టుండి ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కనిపించింది. తాను సినిమాల్లోనూ నటిస్తున్నానంటూ ప్రకటించింది. ఆ తర్వాత తరచూ జిమ్ వర్కవుట్, బోల్డ్ వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును ఊరిస్తోంది. మాటలు, యాక్షన్స్ అన్నీ బోల్డ్‌గానే ఉండే రమ్య ఎంట్రీతో బిగ్‌బాస్ హౌజ్‌కి మైలేజ్ వస్తుందని నిర్వాహకులు ఆమెను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
వీరితో పాటు మరో యువ నటుడు, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయెల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. జబర్దస్త్ లో తన కామెడీతో పాటు వర్షతో లవ్ ట్రాక్‌తోనూ ఇమాన్యుయెల్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో ఇతనూ దాదాపు ఈ సీజన్‌లో అడుగుపెట్టడం తప్పదని తెలుస్తోంది.
అయితే, ఈ నాలుగు పేర్లకు తోడు మరికొంత మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఇటీవల బెట్టింగ్ యాప్‌లతో పాటు అక్రమాస్తుల ఆరోపణలతో తెరపైకి వచ్చిన రీతూ చౌదరి పేరు వినిపిస్తోంది. కంప్లీట్ బోల్డ్ షూట్లు, రియాలిటీ షోలలోనూ బోల్డ్ కామెంట్లతో ఆమె వైరల్ అవుతోంది.
సీరియల్ నటి నవ్య స్వామికి తెలుగు ఇళ్లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. గత సీజన్‌లోనూ ఆమె అడుగుపెడుతుందని ప్రచారం జరగ్గా.. అది ఈ సీజన్‌లో నెరవేరనుందని సమాచారం.

యువ నటుడు సుమంత్ అశ్విన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రతీ సీజన్‌లో ఓ తెలుగు హీరో ఎంట్రీ ఉంటుంది. ఈసారి ఈ యంగ్ హీరోకు అవకాశం దక్కనుందని వినికిడి.
మరో సీరియల్ నటి జ్యోతీ రాయ్‌కి కూడా ఈసారి ఛాన్స్ ఉంటుందట. ఇన్‌స్టా రీల్స్‌లో, చిత్రాల్లో ఈమె హాట్ ఫొటోలకు వచ్చే కామెంట్ల రేంజ్ అదో లెవల్. సీరియళ్లలో వయసుపైబడిన ఆంటీ పాత్రలో కనిపించే ఈ లేడీ బయట సోషల్ ప్రపంచంలో కంప్లీట్ డిఫరెంట్.
యూట్యూబ్ స్టార్, కన్నడ నటుడు ముకేష్ గౌడ కూడా లిస్ట్‌లో ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత సీజన్‌లో తెలుగు షో అయినా కన్నడ నటులు సృష్టించిన హవా అంతా ఇంతా కాదు. విన్నర్‌గా నిలిచిన నిఖిల్, చివరి దాకా ఆకట్టుకున్న పృథ్వీ రాజ్ శెట్టి, లేడీ ఫైర్ బ్రాండ్ ప్రేరణ.. ఈ ముగ్గురూ కన్నడిగలే. ఈ సీజన్‌లోనూ ఓ కన్నడ నటుడిని ఉంచేందుకు ప్లాన్ వేస్తున్నారట.
తెలుగు సీరియల్ నటులు సాయికిరణ్, ఏక్‌నాథ్, నటి శ్రావణి వర్మ.. మిర్చీ బకరాతో సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఆర్‌జే రాజ్, నటి దేబ్‌జని మోదక్, దీపికతో పాటు జూనియర్ నటి హారిక కూడా బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది.
అయితే, ఈ సీజన్‌లో మొత్తం 30 మందికి అవకాశం ఇస్తుండగా.. పలువురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలుగా అడుగుపెట్టనున్నారు. ఈ సీజన్‌లో ఏకంగా 9మంది సామాన్యులకు అవకాశం దక్కుతుండటం మరో సంచలనం. ఏదైమైనా ఈ సీజన్ అంత సాదాసీదాగా ఉండదనేది మాత్రం స్పష్టమవుతుంది. సీజన్-8లో అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఆటాడించిన బిగ్‌బాస్.. ఈ సీజన్‌లో ఇంకేం చేయిస్తారో ఇక తెరపై చూడాల్సిందే.అయితే, ఈ నాలుగు పేర్లకు తోడు మరికొంత మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఇటీవల బెట్టింగ్ యాప్‌లతో పాటు అక్రమాస్తుల ఆరోపణలతో తెరపైకి వచ్చిన రీతూ చౌదరి పేరు వినిపిస్తోంది. కంప్లీట్ బోల్డ్ షూట్లు, రియాలిటీ షోలలోనూ బోల్డ్ కామెంట్లతో ఆమె వైరల్ అవుతోంది. స
సీరియల్ నటి నవ్య స్వామికి తెలుగు ఇళ్లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. గత సీజన్‌లోనూ ఆమె అడుగుపెడుతుందని ప్రచారం జరగ్గా.. అది ఈ సీజన్‌లో నెరవేరనుందని సమాచారం.
యువ నటుడు సుమంత్ అశ్విన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రతీ సీజన్‌లో ఓ తెలుగు హీరో ఎంట్రీ ఉంటుంది. ఈసారి ఈ యంగ్ హీరోకు అవకాశం దక్కనుందని వినికిడి.

మరో సీరియల్ నటి జ్యోతీ రాయ్‌కి కూడా ఈసారి ఛాన్స్ ఉంటుందట. ఇన్‌స్టా రీల్స్‌లో, చిత్రాల్లో ఈమె హాట్ ఫొటోలకు వచ్చే కామెంట్ల రేంజ్ అదో లెవల్. సీరియళ్లలో వయసుపైబడిన ఆంటీ పాత్రలో కనిపించే ఈ లేడీ బయట సోషల్ ప్రపంచంలో కంప్లీట్ డిఫరెంట్.
యూట్యూబ్ స్టార్, కన్నడ నటుడు ముకేష్ గౌడ కూడా లిస్ట్‌లో ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత సీజన్‌లో తెలుగు షో అయినా కన్నడ నటులు సృష్టించిన హవా అంతా ఇంతా కాదు. విన్నర్‌గా నిలిచిన నిఖిల్, చివరి దాకా ఆకట్టుకున్న పృథ్వీ రాజ్ శెట్టి, లేడీ ఫైర్ బ్రాండ్ ప్రేరణ.. ఈ ముగ్గురూ కన్నడిగలే. ఈ సీజన్‌లోనూ ఓ కన్నడ నటుడిని ఉంచేందుకు ప్లాన్ వేస్తున్నారట.
తెలుగు సీరియల్ నటులు సాయికిరణ్, ఏక్‌నాథ్, నటి శ్రావణి వర్మ.. మిర్చీ బకరాతో సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఆర్‌జే రాజ్, నటి దేబ్‌జని మోదక్, దీపికతో పాటు జూనియర్ నటి హారిక కూడా బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది.
అయితే, ఈ సీజన్‌లో మొత్తం 30 మందికి అవకాశం ఇస్తుండగా.. పలువురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలుగా అడుగుపెట్టనున్నారు. ఈ సీజన్‌లో ఏకంగా 9మంది సామాన్యులకు అవకాశం దక్కుతుండటం మరో సంచలనం. ఏదైమైనా ఈ సీజన్ అంత సాదాసీదాగా ఉండదనేది మాత్రం స్పష్టమవుతుంది. సీజన్-8లో అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఆటాడించిన బిగ్‌బాస్.. ఈ సీజన్‌లో ఇంకేం చేయిస్తారో ఇక తెరపై చూడాల్సిందే.