
Bhairavam: హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం శుక్రవారం తెర మీదికి వచ్చింది. వివాదాలు, విమర్శలు, విస్తృత ప్రచారాలతో క్రియేటైన హైప్‌ను ఈ సినిమా అందుకోగలిగిందా..? ఏళ్లుగా సినిమాకు దూరమైన మంచు మనోజ్, విజయాలకు దూరమైన నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లను నిలబెట్టిందా..? రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందనే విషయాలపై ఓజీ జెన్యూన్ రివ్యూ.
కథేంటంటే..?
వారాహి అమ్మవారి గుడి సంపదకు రక్షకులు గజపతి వర్మ(మంచు మనోజ్), వరద(నారా రోహిత్).. ఈ ఇద్దరికీ నమ్మిన బంటు శ్రీను(బెల్లంకొండ శ్రీనివాస్). అమ్మవారి గుడికి ఉన్న రూ.వెయ్యికోట్ల విలువ చేసే భూములపై అక్కడి మంత్రి(శరత్ లోహితాశ్వ) కన్ను పడుతుంది. ఎలాగైనా దక్కించుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుంటాడు. దానికి అడ్డుగా ఉన్న ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులను విడదీసేందుకు ఇద్దరి మధ్య చిచ్చు పెడతాడు. ఈ ప్రయత్నంలో గెలిచాడా.. ఓడాడా..? నమ్మిన బంటు శ్రీను ఎవరి వైపు నిలబడ్డాడు..? అతడు ప్రేమించిన అమ్మాయి ఎవరూ..? అనే పాయింట్లు సినిమాలో కీలకం. ఇవి తెర మీద తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉంది..?
ముగ్గురు హీరోల పాత్రలకు తగ్గట్టు ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. సినిమాకు ముందు కుటుంబ వివాదాలతో సతమతమైన మనోజ్.. ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుని పూర్తి ఎఫర్ట్స్ పెట్టే రోహిత్.. ఈ సినిమాలోనూ పూర్తిస్థాయి నటుడిగా కనిపించాడు. యాక్షన్ సినిమాల్లో బెల్లంకొండ కటౌట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్, పాటలూ, కమర్షియల్ ఎలిమెంట్లను మిస్ అవకుండా కథను నడిపించిన దర్శకుడు.. ప్రేక్షకులను పూర్తిగా సాటిస్ఫై చేసే విషయంలో సఫలం కాలేదనే చెప్పాలి. సెంటిమెంట్‌కు స్కోప్ ఉన్న ఈ కథను ఇంకాస్త బాగా తీసి ఉండొచ్చనే ఫీలింగ్ సగటు సినీ ప్రియుడికి అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఒకసారి చూడాల్సిన సినిమా.
- బలాలు, బలహీనతలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
- కుటుంబంతో కలిసి ఒకసారి చూడాల్సిన సినిమా
ఓజీ రేటింగ్: 3/5
Movie Review | Telugu Movie