Banking Jobs: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఓ తీపి కబురు. భారతదేశ ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రేడ్ B అధికారుల నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ చివరి వారంలోపు విడుదల కానున్నట్లు సమాచారం. అయితే, ప్రతి ఏటా దాదాపు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు పోటీ పడుతున్నారు. ప్రతిష్టాత్మక ఉద్యోగం కావడంతో పోటీ కూడా ఎక్కువే. కాబట్టి ఎంత త్వరగా ప్రిపరేషన్ మొదలు పెడితే అంత మంచిది. అదే మీకు ఉద్యోగం తెచ్చిపెడుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్, నోటిఫికేషన్ అంచనా తేదీలు, జీతం తదితర వివరాలు ఈ కథనంలో..
ఎప్పుడంటే..?
ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ అయిన opportunities.rbi.org.in లో టెక్నికల్ అప్డేట్లు కనిపించడం, పూర్వ సంవత్సరాల షెడ్యూల్‌ను బట్టి చూస్తే, నోటిఫికేషన్ జూన్ మూడో వారంలో వెలువడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్ష తేదీల విషయానికొస్తే, ఫేజ్-1 (ప్రిలిమినరీ పరీక్ష) జూలై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉందన్న సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
డిగ్రీ ఉంటే చాలు..!
గ్రేడ్ B ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సాధారణ విభాగానికి చెందినవారు 60 శాతానికిపైగా మార్కులు సాధించి ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయో పరిమితి..
జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు కాగా, ఓబీసీలకు 33, ఎస్సీ, ఎస్టీలకు 35 సంవత్సరాల వరకూ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ప్రారంభమై, సుమారుగా 25 రోజుల పాటు కొనసాగుతుంది.
ఎంపిక ఎలా..?
ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశలుగా జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమ్స్ పరీక్ష కాగా, ఇందులో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ లాంటి విభాగాలపై అభ్యర్థులు పరీక్షలు ఎదుర్కొంటారు. ఇది 200 మార్కులకు ఉంటుంది.
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఫేజ్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్‌లో ఎకనామిక్ & సోషల్ ఇష్యూస్, ఫైనాన్స్ & మేనేజ్‌మెంట్ వంటి సబ్జెక్టులపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పాటు ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్‌పై డెస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్ మరియు ఇంటర్వ్యూకు కలిపి మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

జీతమెంత..?
జీతభత్యాల విషయానికొస్తే, RBI గ్రేడ్ B ఉద్యోగం అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగాల్లో ఒకటి. ప్రాథమిక జీతం ₹55,200 నుంచి ప్రారంభమవుతుండగా, ఇతర అలవెన్సులతో కలిపి నెలకు ₹1,10,000 వరకు ఉండే అవకాశం ఉంది. లీజ్డ్ హౌస్ ఫెసిలిటీ, ట్రావెల్ అలవెన్స్, మెడికల్, పెన్షన్ స్కీమ్ లాంటి ప్రయోజనాలు ఇందులో భాగమవుతాయి.
RBI అధికారిగా నియమితులైన తర్వాత అభ్యర్థులు నేషనల్ మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ స్టాబిలిటీ, బ్యాంకింగ్ నియంత్రణలపై పనిచేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలుగుతారు. అంతేకాకుండా, పబ్లిక్ డేటా విశ్లేషణ, గవర్నమెంట్ బాండ్ నిర్వహణ వంటి విభాగాల్లోనూ ఈ ఉద్యోగం బాధ్యతను కలిగి ఉంటుంది.
ఇప్పటికే మార్కెట్‌లో ఓవర్‌ఆల్ పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టినవారైతే ముందు ఉంటారు. ప్రివియస్ పేపర్లు, మోడల్ టెస్టులు, నాబార్డ్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే వంటి ప్రభుత్వ డాక్యుమెంట్ల అధ్యయనం ద్వారా ప్రిపరేషన్‌ను బలోపేతం చేసుకోవాలి. ముఖ్యంగా ESI మరియు F&M విభాగాలపై లోతైన అవగాహన అభ్యర్థుల విజయానికి కీలకంగా మారుతుంది.
మొత్తానికి, RBI గ్రేడ్ B ఉద్యోగం అభ్యర్థులకు జీవితంలో స్థిరత్వంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో గొప్ప ప్రాధాన్యం కలిగిన స్థాయిని పొందే అవకాశం. నోటిఫికేషన్ విడుదలకు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రతీ రోజు సద్వినియోగం చేసుకోవడమే విజయానికి మార్గం.
నోటిఫికేషన్ తదితర ఉద్యోగ వివరాల కోసం ఓజీ న్యూస్‌ని ఫాలో అవండి..
Banking Jobs | Latest Bank Jobs Notification | Banking Jobs 2025 | RBI Jobs 2025 | RBI Grade B 2025 Notification | Latest Bank Jobs |