
Hyderabad: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex CM KCR)కు రాసిన లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన ట్వీట్ చేశారు. కవిత కాంగ్రెస్(Congress) వదిలిన బాణమన్నారు. తన తండ్రికి రాసిన లేఖను ఉద్దేశిస్తూ.. డాడీకి లేఖ(Letter to Daddy) పేరుతో ఓ ఓటీటీ ఫ్యామిలీ డ్రామా తీయొచ్చన్నారు. ఎక్స్‌లో ఆయన ఖాతా నుంచి ట్వీట్ చేసిన బండి సంజయ్.. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాశనం చేశాయన్నారు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఏడుస్తున్నారన్నారు.
బీజేపీ ఎప్పుడూ కుటుంబ పాలనకు వ్యతిరేకమన్న బండి.. అది గాంధీలైనా(Gandhi) సరే.. కల్వకుంట్లలైనా సరే.. ఫ్యామిలీ పార్టీలకు ప్రజా సమస్యలతో పని ఉండదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత సమస్యలను ప్రజల భావోద్వేగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. లేఖలో తనను బీజేపీ(BJP) ఇబ్బంది పెట్టిందన్న కవిత మాటలకు.. బీజేపీ ఎవరినీ జైలుకు పంపదని.. ఎవరు తప్పు చేసినా శిక్ష చట్టమే వేస్తుందని.. తన పని తాను చేసుకుపోతుందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలు తెలంగాణా(Telangana) ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ప్రజలెవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదని రాసుకొచ్చారు. ప్రతి సర్వేలో బీజేపీ గ్రాఫ్(BJP Graph) పైకే పోతుంది.. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, అధికారంలో లేకపోయినా, ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తుందన్నారు. ప్రజలు కోరుకుంటున్నది అసలైన మార్పు, అభివృద్ధని.. రాజకీయ కుటుంబాల డ్రామాల కాదని స్పష్టం చేశారు. ఆ మార్పుకోసం బీజేపీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ట్వీట్ చేశారు.

కొద్దిరోజులుగా తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ అంటూ ఓ ఆరు పేజీల లేఖ (Letter to KCR) సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే, రెండు రోజులు దాటిన కొందరు బీఆర్ఎస్ నాయకులు మినహాయించి కేటీఆర్(KTR) గానీ, హరీష్ రావు(Harish Rao), కవితతో సహా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ దీనిపై స్పందించలేదు. కొందరు బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా వారియర్లు.. అవును లేఖ నిజమే అనుకుందాం.. అందులో తప్పేముంది. సలహాలు, సూచనలు మా పార్టీలో సహజమేనంటూ వెనకేసుకొస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. త్వరలోనే కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారాన్ని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కొంత కాలగా కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తోందని.. పార్టీ కచ్చితంగా ఉంటుందని పోస్టులు చేస్తున్నాయి. అయితే, కవిత సోషల్ మీడియాలో పెట్టిన తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఫొటోలకు మాత్రం కేటీఆర్ స్పందించారు. దీంతో అంతా బానే ఉందని బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని సర్కులేట్ చేస్తున్నాయి.