హైదరాబాద్‌, వైజాగ్‌లో రేపేం జ‌రిగినా భ‌య‌ప‌డొద్దు!

Share this article

India-Pakistan: భార‌త్-పాకిస్థాన్‌ యుద్ధానికి స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. క‌శ్మీర్ ప‌హ‌ల్గాంలో ప‌ర్యాటకుల‌పై ఉగ్ర‌దాడి త‌ర్వాత సరిహ‌ద్దుల్లో భారీగా సైన్యాన్ని మొహ‌రించి.. భార‌త సైన్యంపై క‌వ్వింపుల‌కు పాల్ప‌డుతూ దాయాది దేశం యుద్ధానికి కాలుదువ్వుతోంది. న్యూక్లియ‌ర్ వెప‌న్స్ ప్ర‌యోగిస్తామని, భార‌త్‌ను నాశ‌నం చేసి తీర‌తామ‌ని పాక్ మంత్రులు సైతం బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే, దీనికి ఏమాత్రం త‌గ్గ‌ని భార‌త ప్ర‌భుత్వం రోజుకో పావు క‌దుపుతోంది. అంత‌ర్జాతీయ స‌మాజం మ‌ద్ద‌తుతో పాటు యుద్ధం వ‌స్తే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ద‌న్నుగా నిలిచేందుకు ర‌ష్యా(Russia), ఆఫ్ఘ‌నిస్తాన్‌(Afghan), యూఎస్ఏ(USA), దుబాయ్(UAE) లాంటి కీల‌క దేశాల‌ను ఏకం చేస్తోంది. గ‌త రెండు రోజుల్లోనే మూడు సార్లు ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న అత్యున్న‌త సైనిక స‌మావేశం జ‌ర‌గ్గా.. నేష‌న‌ల్ సెక్యురిటీ అడ్వైజ‌రీ బోర్డును తిరిగి నియ‌మించ‌డం, కంటోన్మెంటుల్లో ఉన్న సైనికుల‌ను స‌రిహ‌ద్దుల‌కు పిలిపిస్తోంది.

ఒక‌వేళ యుద్ధం సంభ‌విస్తే ఎలాంటి ప‌రిస్థితులు వ‌చ్చినా త‌ట్టుకునేందుకు దేశ‌వ్యాప్తంగా 259 ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో మాక్ డ్రిల్(Army Mock Drill) నిర్వ‌హిస్తోంది. కేట‌గిరీ 1లో 13, కేట‌గిరీ 2లో 201, కేట‌గిరీ 3లో 45 చొప్పున ప్రాంతాల‌ను విభ‌జించారు అధికారులు. ఏపీలో విశాఖ‌ప‌ట్నం, తెలంగాణాలో హైద‌రాబాద్‌లో ఈ మాక్ డ్రిల్ జ‌ర‌గ‌నుంది. సాయంత్రం 4గంట‌ల‌కు సికింద్రాబాద్‌, కంచ‌న్‌బాగ్‌, మౌలాలీ ఎన్ఎఫ్‌సీ, గోల్కొండ ప్రాంతాల్లో సైన్యం ప్ర‌త్య‌క్షంగా అక్క‌డి పౌరుల‌కు ఆత్మ‌ర‌క్ష‌ణ మెల‌కువ‌లు నేర్ప‌నున్నాయి. యుద్ధం వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులుంటాయి, ఎలా ఆత్మ‌ర‌క్ష‌ణ చేసుకోవాలి, వైమానిక దాడుల స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించనున్నారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ నోటిఫికేష‌న్లు, అనౌన్‌స్మెంట్లు, సైర‌న్లు మోగించ‌డంలాంటివి జ‌రిగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. రేపు జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డొద్ద‌ని.. ఇది కేవ‌లం ప్రాక్టీస్ డ్రిల్ మాత్ర‌మేన‌ని ఆర్మీ అధికారులు కోరుతున్నారు.

ఇవి త‌ప్ప‌కుండా పాటించండి:

  1. ఇంట్లో ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, గ్యాస్ సిలిండ‌ర్లు ఆపేసి ఉంచండి.
  2. న‌గ‌ర వ్యాప్తంగా సైర‌న్ల మోత‌కు భ‌య‌ప‌డొద్దు.
  3. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కి రాకండి.
  4. ఆల్ క్లియ‌ర్ వంటి సందేశం వ‌చ్చే వ‌ర‌కూ ఎటూ వెళ్ల‌కండి.
  5. సాయంత్రం 4గంట‌ల నుంచి 4:30 వ‌ర‌కు మీ ఇంటి మీద నుంచి వైమానిక ద‌ళాలు డ్రిల్ చేప‌డ‌తాయి.. ఆందోళ‌న ప‌డొద్దు.
  6. త‌ప్పుడు వార్త‌లు, ప్ర‌చారాలు న‌మ్మొద్దు. న‌మ్మ‌క‌మైన మీడియా సంస్థ‌ల అప్‌డేట్స్ మాత్ర‌మే న‌మ్మండి.

Share with your friends and family!

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *