అథఃపాతాళానికి తొక్కినా.. అవే బలుపు మాటలు.. ఓడినా మారని తీరుపై ప్రజల ఆగ్రహం
AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇంతకంటే దిగజారదనుకున్న ప్రతీసారీ జనం ఆశల్ని తప్పని నిరూపిస్తూనే ఉంది. 175 సీట్లున్న ఓ రాష్ట్ర అసెంబ్లీలో 151 సీట్లంటే మామూలు విషయం కాదు. పట్టుకుని నిలబడితే పాతికేళ్ల సామ్రాజ్యం. కానీ, ఐదేళ్లూ నిలవలేదు. కారణం.. ఆ పార్టీ నేతల నోటి దూలే. కింది స్థాయి కార్యకర్తల నుంచి పార్టీ కీలక నాయకులు, అధినేతల దాకా అందరిదీ అదే కథ. ఆ మాటలు వినలేక కంపరం పుట్టి.. జనాలే ఈడ్చి కొడితే 11 స్థానాలకు పరిమితమయ్యే దాకా తెచ్చింది అదే కదా..? కనీసం, ఓడాక అయిన మారతారా.. జనానికి ఏం కావాలో తెలుసుకుంటారా అంటే అదీ లేదు.. ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిన నాయకులు ఎక్కడికక్కడ కళ్లెం లేని జంతువుల్లా విచ్చలవిడిగా అదే తరహాలో నోరు పారేసుకుంటున్నారు. అందుకు తాజాగా నెల్లూరు జిల్లా వైకాపా నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డి(Prasanna Kumar Reddy) వ్యాఖ్యలే నిదర్శనం. (Nellore YCP)
కోవూరు ప్రస్తుత ఎమ్మెల్యే, తెదేపా మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Prashanti Reddy)ని ఉద్దేశిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న చేసిన నీచపు వ్యాఖ్యలు ఎంతమాత్రమూ సహించలేనివి.. కూడనివి. నేరుగా ఓ మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ పబ్లిక్‌గానే తీవ్రంగా దుర్భాషలాడాడు ప్రసన్నకుమార్ రెడ్డి. ఆమె భర్త.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారని.. ఏదో రాత్రి నిద్రలోనే ఆయన్ను చంపేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడితో ఆగకుండా.. ఆమె గత చరిత్ర ఉమ్మడి రాష్ట్రంతో పాటు విడిపోయాక ఏపీ మొత్తానికి, గుజరాత్, సూరత్, కాశీ లాంటి ప్రాంతాల్లోనూ తెలుసని.. బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ చేసిందంటూ విచక్షణ మరిచి మాట్లాడాడు. దీంతో పాటు, ప్రభాకర్ రెడ్డి అడిగితే మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్లమని.. ఆఖరికి బోరుబావిని చేసుకున్నాడంటూ అసహ్యకర వ్యాఖ్యలకు పూనుకున్నాడు ప్రసన్నకుమార్ రెడ్డి.
అయితే, ఈ నీచపు మాటలకు అదే వేదికపై ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సిగ్గులేకుండా నవ్వడం, చప్పట్లు కొట్టడం పార్టీ ఎంత దిగజారిపోతోందో చెబుతోంది. ఇదిలా ఉండగా.. ఈ వ్యాఖ్యలను రాష్ట్రమంతా మహిళాలోకం, పార్టీలు, నేతలు ముక్తకంఠంతో ఖండిస్తుంటే.. ఆ పార్టీ అధినేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు.. వైఎస్ జగన్ రెడ్డి మాత్రం ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించాడు. ఆ వ్యాఖ్యలకు బదులుగా మహిళలు చేసిన దాడుల్ని ఖండించాడే తప్ప.. ఎక్కడా అవునూ, ప్రసన్న చేసింది తప్పని ఒక్క మాట చెప్పలేదంటూ.. ఆ నాయకుడి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అథఃపాతాళానికి తొక్కింది అవే కదా..?
ఈ నీచపు మాటలకు ఇది మొదలు కాదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(CBN) సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి వ్యక్తిత్వంపై ఏకంగా అసెంబ్లీ సాక్షిగా.. అప్పటి మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుటుంబాన్ని, ఆయన తల్లిని, కూతుళ్లను సైతం వదలని ఇదే మంత్రులు, కొందరు పెయిడ్ ఆర్టిస్టులు చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీని అథఃపాతాళానికి తొక్కేశాయి. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి నేతలు పబ్లిక్ మీటింగుల్లో, మీడియా ముందే ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బూతులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నించిన సామాన్యులపై దాడులకు, హత్యలకూ పూనుకున్నారు. శ్రీరెడ్డి, పోసాని, శ్యామల, బోరుగడ్డ అనీల్.. ఇలా ఒక్కరా ఇద్దరా వందల మందిని దించి బూతులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసినా.. అది బెడిసికొట్టింది. ఓ నాయకుడికి వచ్చిన కోపం.. మూడు పార్టీలను ఒక్కటి చేసింది.. రాష్ట్రం కోసం అన్నీ త్యాగం చేసి.. అధికార మదంతో, అహంకారంతో విర్రవీగుతున్న రక్కసి మూకలను అథఃపాతాళానికి తొక్కేసింది.
ఉనికే ఉండదు జాగ్రత్త!
ఇప్పటికే 11కి దిగజారిన పార్టీ ప్రతిష్ట.. ఇదే కొనసాగితే ఉనికే లేకుండా చేస్తుందనేది తోసిపుచ్చలేని నిజం. వైకాపాను ఓ రాజకీయ పార్టీగా నిలబెట్టుకోవాలంటే.. నిజంగానే భవిష్యత్తు కావాలనుకుంటే.. ఈ నేతల నోళ్లకు కళ్లెం వేయక తప్పదు. వీధుల్లో సైకోల్లా విహరిస్తున్న, రప్పా రప్పా అంటూ రెచ్చిపోతున్న కొందరు కార్యకర్తలనూ కట్టడి చేయకపోతే జనం చూస్తూ ఊరుకుంటారనుకోవడం భ్రమే అవుతుంది. ఇప్పటికే కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ఓట్లతో మాత్రమే చూయించారు జనం. అది మీరితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలువలు చాటండి.. ప్రతిపక్ష పాత్ర పోషించండి. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. అవినీతిని, జరగని అభివృద్ధినీ ప్రశ్నించండి. ఏ పెయిడ్ ఆర్టిస్టూ అవసరం లేకుండానే.. జనం మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనిస్తారని.. కుర్చీపై కూర్చోపెడతారన్న ఇంగితాన్ని మరిచిపోవద్దు.