AP: అత్యంత విష‌మంగా ముద్ర‌గ‌డ ఆరోగ్యం!

Mudragada Padmanabham

Share this article

AP: కాపు ఉద్య‌మ నేత‌, వైఎస్సార్సీపీ కాంగ్రెస్ నాయ‌కులు ముద్ర‌గ‌డ ప‌ధ్మ‌నాభం ఆరోగ్యం తీవ్రంగా విష‌మించిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను హైద‌రాబాద్ త‌ర‌లిస్తున్నార‌న్న వార్త‌లు వినిపించాయి.. అయితే షుగ‌ర్ లెవ‌ల్స్ అత్యంత ప్ర‌మాద‌క‌రంగా 35కు ప‌డిపోయిన‌ట్లు వైద్యులు గుర్తించ‌డంతో కాకినాడ‌లోని మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో చేర్పించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఐసీయూలో చికిత్స అందుకుంటున్న ముద్ర‌గ‌డ ప్ర‌స్తుతం స్పృహ‌లో లేర‌ని వైద్యులు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడకు డయాలసిస్ చేస్తున్నామని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌న్న వార్త తెలుసుకున్న కాపు నేత‌లు ఆసుప‌త్రికి చేరుకుంటున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *