
Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానిక సంస్థలకు నేడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేతల రాజీనామాలు, మృతి కారణంగా ఖాళీ అయిన 28 స్థానాలకు నేడు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి, కారంపూడి, నరసరావుపేట ఉప ఎంపీపీ స్థానాలకు, నెల్లూరు జిల్లా దగదర్తి ఉప ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తిరువూరు నగరపంచాయతీ ఛైర్ పర్సన్ ఎన్నిక కూడా ఈరోజే జరగనుంది. కదిరిలో రెండు ఉప ఛైర్ పర్సన్ స్థానాలు, పది మండల పరిషత్ ఉపాధ్యక్షుల స్థానాలకూ ఎన్నిక జరుగుతోంది. ఈ చోట్ల కోరం లేక పోతే ఎన్నిక రేపటికి వాయిదా పడనుంది. ఇందులో చాలా స్థానాలు గతంలో వైసీపీ చేతిలో ఉన్నవే. వీటిని ఈ ఎన్నికల్లో దక్కించుకుని ఆధిపత్యం సాధించేందుకు కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. పలుచోట్ల తెదేపా, జనసేన పంచుకోనున్నాయి.