AP: భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న ఇంజినీరింగ్ చీఫ్ (ENC) సబ్బవరపు శ్రీనివాస్, రిటైర్మెంట్‌కు కొన్ని రోజుల ముందు రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కారు.
వివరాల్లోకి వెళితే, రూ.35.5 కోట్ల విలువైన బిల్లులకి ఆమోదం ఇచ్చేందుకు శ్రీనివాస్ రూ.5 కోట్ల లంచాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన రూ.25 లక్షల అడ్వాన్స్ తీసుకుంటుండగా విజయవాడలో ఏసీబీ అధికారులు వెంటాడి పట్టుకున్నారు.
మూడోసారి అవినీతి కేసు!
ఇది మొదటిసారి కాదు… శ్రీనివాస్ గతంలోనూ 2014లో రెండు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు మూడోసారి అవినీతి ఆరోపణలతో ఏసీబీ చర్యలు ఎదుర్కొంటున్నారు. అయినా పాఠం పట్టలేదని స్పష్టమవుతోంది.
ఏసీబీ అధికారులు మాట్లాడుతూ – “శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడని స్పష్టమైన ఆధారాలతో పట్టు పడినాము. విచారణ కొనసాగుతోంది. అవసరమైతే మరిన్ని కేసులు బయట పడే అవకాశముంది” అని వెల్లడించారు.