
Delhi: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలక నేత నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)పై అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో నంబాల కేశవరావే ప్రధాన సూత్రదారి. అయితే, బుధవారం అతని మృతిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన ట్వీట్ చేశారు.
నక్సలిజంపై భారత్ చేసిన ముప్పై ఏళ్ల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ నేతను భద్రతా దళాలు మట్టుబెట్టడం ఇదే తొలిసారి. మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రతా దళాలు , ఏజెన్సీలను అభినందిస్తున్నాను అంటూ ట్వీట్లో రాసుకొచ్చిన షా.. ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు చేయడంతో పాటు 84 మంది స్వయంగా లొంగిపోయారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31లోపు దేశంలో నక్సలిజమే లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం సంకల్పించిందంటూ ట్వీట్ చేశారు అమిత్ షా.
.