మ‌హిళ‌ల‌కు మ‌ర్డ‌ర్ చేసే హ‌క్కు ఇవ్వండి.. రాష్ట్రప‌తికి ఎన్సీపీ నేత సంచ‌ల‌న‌ లేఖ‌

NCP women leader letter to president for murder

Share this article

Mumbai: దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌హారాష్ట్రకు చెందిన‌ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ (Sharad Pawar) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే ఓ సంచ‌ల‌న డిమాండ్ చేశారు. (NCP Women Wing Leader)

దేశంలోని ప్ర‌తీ మ‌హిళ‌కు ఓ హ‌త్య చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ భార‌త‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఇటీవ‌ల లేఖ రాశారు. మ‌హిళ‌ల‌పై నిత్యం జ‌రుగుతున్న దాడులు, అఘాయిత్యాల‌కు స‌రైన ప‌రిష్కారం దొర‌క‌ట్లేదని.. న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాలు దుర్మార్గుల‌కే స‌హ‌క‌రిస్తున్నాయ‌ని ఆమె లేఖ‌లో పేర్కొన్నారు. చిన్నారుల నుంచి మొద‌లుకుని వ‌య‌సు పైబ‌డిన వారు అని చూడ‌కుండా అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముంబయిలో జరిగిన 12 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్(Gang Rape) ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి దారుణాలు నిరంతరం జరుగుతున్నప్పటికీ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ నిర్ల‌క్ష్యంగా వ్య‌వహ‌రిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

ఖడ్సే తన లేఖలో ఇటీవల ప్రచురితమైన అంతర్జాతీయ సర్వే నివేదికను ప్రస్తావించారు. “భారతదేశం ప్రపంచంలో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా నిలిచింది. మహిళలపై అత్యాచారాలు, అపహరణలు, గృహహింస రోజురోజుకు పెరుగుతున్నాయి. న్యాయపరంగా సత్వర నిర్ణయాలు లేకపోవడం వల్ల బాధితులకు న్యాయం అందడంలో తీవ్ర విఫలం జరుగుతోందిష అని ఆ నివేదిక సారాంశాన్ని లేఖ‌లో ఉటంకించారు.

ఒక హ‌త్య‌కు అనుమ‌తివ్వండి..!
మహిళలపై దాడి చేయాలనే దురాలోచనను, అత్యాచార దృక్పథాన్ని, inactive police వ్యవస్థను నిర్మూలించాలంటే మ‌హిళ‌ల‌కు ఆయుధం అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఖ‌డ్సే లేఖ‌లో పేర్కొన్నారు. ఇలా జ‌ర‌గాలంటే ప్ర‌తీ మ‌హిళ‌కు క‌నీసం ఒక హ‌త్య చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని లేఖ‌లో కోరారు. అప్పుడే న్యాయ వ్య‌వ‌స్థ మేల్కొంటుంది. ఇలాంటి త‌ప్పుల‌ను అంతం చేసేందుకు త‌క్ష‌ణ శిక్ష‌లే స‌రైన మార్గ‌మ‌న్నారు.

దేశ మ‌హిళ‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యం కాబ‌ట్టి రాష్ట్రప‌తి ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిశీలించాల‌ని.. దీనిపై సానుకూలంగా స్పందించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Women safety in India | Rohini Khadse demand | Immunity for murder for women | NCP Women Wing letter to President | Mumbai girl gang rape incident

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *