Pushpa: పుష్ప సినిమా విడుదలలో వివాదం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్(Pawan Kalyan) తో విబేధాలు, మెగా-అల్లు కుటుంబాల కలహాల మంటలు చల్లారకముందే ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ మాటలు కొత్త ఆజ్యం పోస్తున్నట్టున్నాయి. ఎప్పుడూ వేధికలపై తన మాటలను బహిరంగంగానే ప్రకటించే బన్నీ.. మరోమారు గుప్తార్థపు వ్యాఖ్యలు చేశారు. సినిమాల నుంచి దూరమయ్యేలా తనను చాలా సమస్యలు చుట్టుముడుతున్న ఫ్యాన్స్ కోసం నిలబడుతున్నానంటూ.. సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో తనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారని.. జాతీయ స్థాయిలో ఊహించని గుర్తింపు దక్కిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తెలిపారు.

ముంబైలో జరుగుతున్న వేవ్స్ (Waves) సదస్సుకు అతిథిగా హాజరైన బన్నీ.. అభిమానులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తానని.. ఎన్నో సవాళ్లు ఎదురైనా సినిమాలు తీయడం మాత్రం ఆపట్లేదని చెప్పుకొచ్చారు. అభిమానుల ఆధరణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని.. తనకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదని వెల్లడించారు ఐకాన్ స్టార్.