AI: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై టెక్ దిగ్గజం, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ జీ 42 ఇండియా సీఈఓ మను జైన్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం మంగళగిరిలో సీఎం చంద్రబాబును కలిసిన మనూ జైన అనంతరం ఎక్స్‌లో ధన్యవాదాలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. రాజకీయ దిగ్గజాలు, పాతతరం నాయకులు అధునాతన సాంకేతికతలను పట్టించుకోరన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వీరందరికీ భిన్నమని.. నాడు హైదరాబాద్ నగరంలో ఐటీకి పునాది వేసి మేటి నగరంగా తీర్చిదిద్దడంలో, నేడు విశాఖ అత్యాధునిక ఐటీ, ఏఐ సంస్థలకు హబ్‌గా మారేందుకు ఆయన దక్షతే కారణమన్నారు. తాను షియోమీ సంస్థ భారత్ హెడ్‌గా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు పదేళ్ల కిందే అమరావతిలో తమ టీవీ, మొబైల్ ఫోన్ల తయారీ ఏర్పాటుకు ఒత్తిడి చేశారన్నారు.
పదేళ్ల నుంచీ సీఎం చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుంటున్నానని. ఈ ప్రయాణంలో మార్గదర్శిగా కీలక భూమిక పోషించారన్నారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు కీలకంగా మారే ప్రాజెక్టులలో ఆయనతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు మనూ జైన్. నేరుగా తనతో మాట్లాడేందుకు 45 నిమిషాల సమయం కేటాయించినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ మరోసారి చంద్రబాబునాయుడి ముందుచూపును గుర్తుచేస్తోంది. అమరావతికి వివిధ అంతర్జాతీయ సంస్థలను తీసుకురావడంతో పాటు, విశాఖను ఐటీ నగరంగా తీర్చిదిద్దేందుకు, భారత్‌లో ఏ రాష్ట్రమూ ఆలోచించని క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ నెలకొల్పేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థలతో సీఎం చంద్రబాబు వరసగా సమావేశమవుతున్నారు.