పాకిస్థాన్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న ధురంధర్ సినిమా..
Netflix: భారత స్పై థ్రిల్లర్ Dhurandhar పాకిస్థాన్ లో డిజిటల్ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు Aditya Dhar తెరకెక్కించిన ఈ చిత్రంలో Ranveer Singh ప్రధాన పాత్ర పోషించారు.
జనవరి 30 (శుక్రవారం) డిజిటల్ రిలీజ్ అయి వారం కూడా దాటకముందే ఈ సినిమా Netflix పాకిస్థాన్ ట్రెండింగ్ లిస్ట్ లో మొదటి స్థానానికి చేరుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్లు దీనికి స్పష్టమైన ఆధారంగా నిలుస్తున్నాయి. థియేటర్లలో విడుదల కాని పాకిస్థాన్ మార్కెట్ లో, ఆన్ లైన్ ద్వారా ఈ సినిమా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చేరుకోవడం విశేషం.
పాక్… వద్దంటే వద్దందీ..!
ఈ సినిమాలో తమ దేశాన్ని కించపరిచారంటూ పాకిస్థాన్ థియేటర్లు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేశాయి. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలకు ప్రధాన వాట పాకిస్థాన్ నుంచే వస్తుంది. అక్కడ సరైన సినిమాలు లేక పాకిస్థాన్ సినీప్రియులంతా భారతీయ చిత్రాలకోసమే ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సినిమాను పాక్ ప్రభుత్వం థియేటర్ల ప్రదర్శనకు నో చెప్పడంతో… దర్శక నిర్మాతలు ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలు, పాకిస్థాన్ లో థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం వల్ల భారీ బాక్సాఫీస్ ఆదాయం కోల్పోయినా, డిజిటల్ రిలీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లలో 33 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. మొత్తం మీద రూ.1,300 కోట్ల గ్రాస్ తో ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

ఆ దేశంలోనే టాప్..!
పాకిస్థాన్ లో నెట్ ఫ్లిక్స్ (Neflix) లో ప్రస్తుతం ‘ధురంధర్’ టాప్ లో కొనసాగుతోంది. దీనికంటే వెనుకబడిన చిత్రాల్లో Tere Ishk Mein, Haq, అలాగే The Big Fake ఉన్నాయి. శనివారం నుంచే ఈ చిత్రం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నట్లు సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి.
థియేటర్లలో భారతీయ సినిమాలపై ఉన్న పరిమితుల కారణంగా ఇప్పటివరకు ఈ చిత్రాన్ని చట్టబద్ధంగా చూడలేని పాకిస్థాన్ ప్రేక్షకులకు, డిజిటల్ రిలీజ్ కొత్త అవకాశం ఇచ్చింది. థియేట్రికల్ రిలీజ్ కు ఎనిమిది వారాల తర్వాత వచ్చిన ఓటిటి విడుదలతో ‘ధురంధర్’ అక్కడి ప్రేక్షకుల్లో వేగంగా ఆదరణ పొందుతోంది.
బలమైన కథనం, రణ్వీర్ సింగ్ ఎనర్జిటిక్ నటన, ఇంటెన్స్ స్పై డ్రామా అంశాలతో ‘ధురంధర్’ ఇప్పుడు పాకిస్థాన్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
