Kakinada : ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ టూర్ లో ఉండటంతో.. నేడు ఆయనతో పాటు ఉన్న టీడీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా ఆయనకు నారా లోకేష్ బర్త్ డే విషెస్ తెలిపి కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఎంపీ సానా సతీష్ కు దేవుడు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షును ప్రసాదించి, ఉన్నత పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
