Land Rights: మీ భూమి మీకు తెలియకుండానే… మరొకరి పేరుమీద మారిందా? ఇలా చేయండి!

Land Rights india

Share this article

Land Rights | హైదరాబాద్: ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో భూముల మార్పిడి, డిజిటల్ పత్రాలలో పొరపాట్లు, రెవిన్యూ అధికారుల అక్రమ చర్యల వల్ల ఎంతో మంది రైతులు తమ భూములు కోల్పోతున్న దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రైతులకు తెలియకుండానే పట్టాదారు పాసుపుస్తకాలు, 1బి, ఆడంగల్ పత్రాలు ఇతరుల పేరుమీదకు మారిపోతున్న ఘటనలు అధికమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది రైతులు “ఇప్పుడు ఏం చేయాలి?”, “తిరిగి భూమిని ఎలా సాధించాలి?” అనే గందరగోళంలో ఉన్నారు. అయితే, మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం – ఇది నేరం. మీ భూమిని మీకు తెలియకుండానే ఇతరుల పేరుమీదకి మార్చితే, చట్టపరమైన చర్యలు తీసుకునే పూర్తి హక్కు మీకుంది.

✅ భూమి మీ పేరునుండి మారిపోయిందా? ముందుగా తెలుసుకోవాల్సినవి:

➡️ మీ అనుమతి లేకుండా – అంటే మీరు సంతకం చేయకుండా, లేదా దరఖాస్తు పెట్టకుండా – మీ భూమి పేరు మీద రికార్డులు మారితే, అది ప్రభుత్వ అధికారుల తప్పిదం లేదా కుట్రగా పరిగణించబడుతుంది.
➡️ ఇలా జరిగితే, గ్రామ రెవిన్యూ అధికారి (VRO), మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ (MRI), సర్వేయర్, తహసిల్దార్ లు నేరానికి పాల్పడ్డ వారిగా గుర్తించబడతారు.
➡️ భారత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 197 ప్రకారం, వీరిపై ఫిర్యాదు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు.

📌 రైతులు తీసుకోవాల్సిన చర్యలు ఇవే:

  1. సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి.
  2. మీ వద్ద ఉన్న భూమికి సంబంధించిన పత్రాల జిరాక్స్ కాపీలు ఆ ఫిర్యాదుకు జతపరచాలి.
  3. విచారణ లేకుండా 1బి, ఆడంగల్, పట్టాదారు పాస్‌బుక్ జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పై అధికారులకు ఫిర్యాదు చేయండి.
  4. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, డీఆర్వో వంటి అధికారులను సంప్రదించండి.
  5. పైస్థాయి అధికారులు స్పందించకపోతే, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నేర చర్యలు తీసుకోవచ్చు.
land rights india

⚖️ సుప్రీంకోర్టు తీర్పు ఏమంటోంది?

2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన క్రిమినల్ అప్పీల్ నెం: 1837/2019 ప్రకారం, తప్పు చేసిన ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పై అధికారుల అనుమతి అవసరం లేదు.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ అధికారికి వర్తిస్తుంది.

📣 ముఖ్య గమనిక:

🔸 ROR చట్టం ప్రకారం (Record of Rights), మీరు డైరెక్టుగా తహసిల్దార్ వద్దనే పరిష్కారం కోరవచ్చు.
🔸 ఆర్డీవో లేదా జాయింట్ కలెక్టర్ దగ్గరకు అప్పీల్ వెళ్లాల్సిన అవసరం లేదు.
🔸 మీరు విచారణ లేకుండా నష్టపోయినట్లైతే, అది తప్పు చేసిన అధికారుల బాధ్యత.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *