BIS: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు పరిశ్రమను సందర్శించారు. కాలేజీలో బీఐఎస్ ఏర్పాటు చేసిన స్టాండర్డ్ క్లబ్ ఆధ్వర్యంలో 65 మంది ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులు శుక్రవారం తుక్కుగూడ ఈ-సిటీలోని ఓరియెంట్ ఎలక్ట్రికల్స్ సంస్థను సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులకు వివిద విద్యుత్ ఉపకరణాల తయారీలో పాటించే భారతీయ ప్రమాణాలు, నాణ్యతను అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఫ్యాక్టరీ తయారీ కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు ముడి వస్తువుల నుంచి వివిధ రకాల ఫ్యాన్లు తయారయ్యే విధానాన్ని దశల వారీగా అక్కడి సిబ్బంది వివరించారు.

అనంతరం అక్కడి మీటింగ్ హాల్‌లో.. పలు అంశాలపై విద్యార్థులకు క్విజ్, డిబేట్ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిశ్రమల్లో పాటించే జాగ్రత్తలను అక్కడి సిబ్బంది వివరించారు. బీఐఎస్ విద్యార్థుల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, స్టాండర్డ్ క్లబ్ ఉద్దేశం, ప్రతీ వారం బీఐఎస్ విడుదల చేస్తున్న స్టాండర్డ్స్ వాచ్ బులెటిన్, తదితర కార్యక్రమాలు విద్యార్థుల కెరీర్ తో పాటు అకడమిక్ లోనూ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో బీఐఎస్ ఎస్పీవో అభిసాయి ఇట్ట వివరించారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన్ కాలేజీ ఎలక్ట్రికల్ విభాగం అధ్యాపకులు ప్రవీణ్, ఇందిరా పాల్గొన్నారు.
