Good News: రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం “అన్నదాత సుఖీభవ పథకం 2025” కింద అర్హులైన ప్రతి రైతుకు ₹7,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఇందులో ₹2,000 కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KISAN పథకం నుంచి, మరో ₹5,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వనున్నారు.
ఇప్పటికే అర్హుల తుది జాబితా విడుదలైంది. జూలై 18, 2025 నాటికి మొత్తం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పేరు లేకపోతే జూలై 10లోపు తప్పకుండా దరఖాస్తు చేయాలి.
📋 అర్హతలు ఎలా తెలుసుకోవాలి?
రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే:
అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి – 🔗 https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
ఆధార్ నెంబర్ మరియు కాప్చా ఎంటర్ చేయాలి
పేరు ఉంటే స్టేటస్ చూపుతుంది
“Details Not Found” వస్తే వెంటనే సచివాలయంలో/రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి
📞 వాట్సాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేయొచ్చు
మీ ఆధార్ నెంబర్‌ను 95523 00009 అనే Mana Mitra హెల్ప్‌లైన్ నెంబర్‌కి వాట్సాప్‌లో పంపితే, మీకు స్టేటస్ మెసేజ్ ద్వారా వస్తుంది. ఇది రైతులకు మరింత సులభతరం.
📝 అర్జీకి అవసరమైన డాక్యుమెంట్లు:
ఆధార్ కార్డు
బ్యాంక్ ఖాతా డిటెయిల్స్
భూమి పత్రాలు / పట్టాదారు పాస్‌బుక్
✅ అర్హులెవరు?
భూమి ఉన్న రైతులు
PM-KISAN డేటాలో లేదా రాష్ట్ర పథకాల డేటాలో పేరు ఉండాలి
ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి
📌 ముఖ్య గమనిక:
మీ పేరు జాబితాలో లేకపోతే జూలై 10లోపు తప్పకుండా అర్జీ చేయండి. అర్జీలు గ్రామ సచివాలయాలు, లేదా రైతు సేవా కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు.
🗓️ ముఖ్యమైన తేదీలు:
✅ తుది జాబితా విడుదల: ఇప్పటికే విడుదలైందీ
🗓️ అర్జీ చివరి తేదీ: జూలై 10, 2025
💰 డబ్బుల జమ తేదీ: జూలై 18, 2025 లోపు
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు నేరుగా ఆర్థిక ఉపశమనం లభించనుంది. రైతు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య రైతాంగానికి తీపికబురు అని రైతులు అభిప్రాయపడుతున్నారు.
👉 మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి –
https://annadathasukhibhava.ap.gov.in
