Dalai lama: దలైలామా.. ఆధ్యాత్మికత పరిచయం ఉన్న అందరూ ఈ పేరు వినే ఉంటారు. ఏళ్లుగా మతం, ఆధ్యాత్మికతలకు మారుపేరైన ఈ పేరు.. ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. రెండు దేశాల స్వాతంత్య్రాన్ని.. మూడు దేశాల మధ్య సఖ్యతను విచ్చిన్నం చేసే చిచ్చుకూ హేతువవుతోంది. ఇంతకీ ఏంటీ వివాదం..? అసలు ఎవరీ దలైలామా..? ఈయన ఎన్నిక ఎలా జరుగుతుంది..? వాళ్లు చేసే పనులేంటి..? ఎందుకు చైనా, భారత్ ఈ ఎన్నిక కోసం పోటీ పడుతున్నాయి..? అన్ని అంశాలపై ఈ కథనం.
దాదాపు అందరికీ తెలిసిన దలైలామా అంటే ఎప్పుడూ కాషాయంలో కనిపించే ప్రస్తుత దలైలామా టెన్జిన్ గ్యాట్సో(Tenzin Gyatso) గుర్తొస్తారు. అంతకు ముందున్న దలైలామాలు కేవలం బౌద్ధ మతానికి పరిమితమైతే.. ఇప్పుడున్న దలైలామా గ్యాట్సో మాత్రం ప్రపంచానికి సుపరిచితం. అదీ ఎంతంటే.. దాదాపు 80ఏళ్ల పాటు ఆయన అసలు పేరునే మరిచిపోయేంత పరిచయం.
దలైలామా అంటే..?
దలై లామా అనేది బౌద్ధ మతానికి చెందిన అత్యున్నత ఆధ్యాత్మిక పదవి. దలైలామా అంటే “జ్ఞాన సముద్రంష అనే అర్థం వస్తుంది. హైందవంలో పీఠాధిపతులు, ఇస్లాంలో సర్వోన్నత ప్రవక్త స్థాయిలో బౌద్ధ మతానికి దలైలామా. టిబెట్ దేశంలో ఉన్న బౌద్ధ మతాన్ని పరిరక్షించడం, ప్రపంచానికి శాంతిని, క్షమ, సత్యం లాంటి బౌద్ధం విలువలను ప్రచారం చేయడం వీరి పని. జీవిత బోధిసత్వుడిగా వీరిని భావిస్తుంటారు.
ఎవరు దలైలామా అవుతారు..?
ఓ దలైలామా మరణించిన తర్వాత.. పునర్జన్మ (reincarnation) సిద్ధాంతం ఆధారంగా తదుపరి దలై లామా శరీరాన్ని ధరిస్తాడని బౌద్ధుల నమ్మకం. ప్రస్తుత బాధ్యతల్లో ఉన్న దలైలామా మరణించిన తర్వాత.. మత గ్రంథాలు, విశ్వాసాలతో పాటు ఆయన పునర్జన్మ ఎక్కడ జరిగిందే పలు విశ్వాసాల ఆధారంగా బౌద్ధ పండితులు పరిశీలిస్తారు. పిల్లవాడిని గుర్తించి, పరీక్షలు చేస్తారు. మునుపటి దలైలామా ఉపయోగించిన వస్తువులను ఈ బిడ్డ గుర్తిస్తే.. అతన్నే వారసుడిగా ప్రకటిస్తారు. తర్వాత బౌద్ధ మత పెద్దల సమక్షంలో అధికారికంగా ప్రకటిస్తారు.ఇది పూర్తిగా ఆధ్యాత్మిక నిబద్ధతతో కూడిన ప్రక్రియ. ఈ ఎంపికలో తుది తీర్పు బౌద్ధ పీఠానిదే.

ప్రస్తుతం దలై లామా ఎవరు?
ప్రస్తుతం ఉన్న 14వ దలై లామా – టెన్జిన్ గ్యాట్సో. 1935లో జన్మించిన ఆయన్ను.. 15ఏళ్ల వయసులో అంటే 1950లో దలై లామాగా నియమితులయ్యారు. 1959లో చైనా టిబెట్‌ను ఆక్రమించడంతో ఆయన భారత్‌కు ఆశ్రయం కోరుతూ ధర్మశాల(Dharamshala)కు వచ్చారు. అప్పటి నుంచే అక్కడే నివసిస్తున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మద్దతుదారులు ఉన్నారు. ముందున్న 13 మంది కంటే ఎక్కువ గ్యాట్సేనే దలైలామాగా ప్రపంచానికి పరిచయం. ప్రభుత్వాధినేతలు, అన్ని దేశాల ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి.
ఇప్పుడు వివాదమేంటి..?
టిబెట్.. భారత్, చైనాకు ఆనుకుని ఉన్న స్వతంత్య్ర దేశం. ఈ దేశాన్ని ఆక్రమించేందుకు, పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు చైనా గత 80ఏళ్లుగా ప్రయత్నం చేస్తోంది. టిబెట్‌లో బౌద్ధ మతం ఎక్కువ. అక్కడ దలైలామా చెప్పిందే వేదం. ప్రభుత్వాధినేతలు ఎవరున్నా దలైలామా మాటకే ప్రజలు విలువిస్తారు. అయితే, 1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించుకుంది. కానీ, జనం వ్యతిరేకతతో అక్కడ పట్టు సాధించలేకపోతోంది. అత్యున్నత బౌద్ధ పీఠం తమ గుప్పిట్లో ఉంటే టిబెట్‌పై ఆధిపత్యం సాధ్యమని చైనా భావిస్తోంది. అయితే, దీనికి ప్రస్తుత దలైలామా గ్యాట్సోతో పాటు పీఠాధిపతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్ తమవేనని చైనా ప్రకటించుకుంటోంది.

భారత్ కు సంబంధమేంటి..?
పక్కదేశం టిబెట్(Tibet).. ఆది నుంచీ భారత్ స్నేహత్వమే కోరుకుంటోంది. చైనా(China) దురాక్రమణ నుంచి బయటపడేందుకు భారత్(India) సాయం కోరుతోంది. ఇక్కడి ధర్మశాల కేంద్రంగానే దలైలామా ప్రస్తుత పీఠాధిపతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ప్రస్తుత దలైలామా వయసు పైబడటంతో తర్వాతి దలైలామా ఎంపిక అనివార్యంగా మారింది. జూలై 6న ఆయన 90వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ వేడుకల్లోనే ఓ బాలున్ని తన వారసుడిగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. దీనిపై చైనా పట్టును వ్యతిరేకిస్తూ.. భారత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijiju) స్పందించారు. దలైలామా వారసుడిపై ఆయనతో పాటు ఆయన ఏర్పాటు చేసిన ట్రస్టుకే పూర్తి హక్కు ఉందన్నారు. ఇతర దేశాలకు, చైనాకూ దీనిలో జోక్యం చేసుకునే హక్కు లేదని తేల్చి చెప్పారు. జూలై 6న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రిజిజు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
భారత్‌కు చైనా వార్నింగ్
దలైలామా వారసుడిపై కేంద్ర మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా మండిపడింది. ఈమేరకు బీజింగ్(Beijing) అధికార ప్రతినిధి భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇది పూర్తిగా చైనా నిర్ణయమని. ఇందులో భారత్ తలదూర్చొద్దని వార్నింగ్ ఇచ్చారు. దలైలామా వారసుడి ఎంపికలో భారత్ వేలుపెడితే ఇరు దేశాల మధ్య సఖ్యత దెబ్బతింటుందని.. వ్యాపారాలు ఇతరాలకు ఇబ్బంది ఏర్పడదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది.
అయితే, జూలై 6న జరిగే దలైలామా జన్మదిన వేడుకల్లో భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం అందడం.. భారత ప్రతినిధిగా రిజిజు హాజరవుతుండటం చైనాకు మరింత మంట రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దలైలామా సైతం.. వారసుడి ఎంపిక కేవలం ట్రస్టు నిర్ణయిస్తుందని. అది తమ సంప్రదాయంతో పాటు తమకే ఉన్న హక్కని ప్రకటించారు. దీంతో ఈ 6వ తేదీన దాదాపు ప్రస్తుత దలైలామా నిర్ణయించిన బాలుడే తదుపరి దలైలామాగా నియమించబడతారని స్పష్టమవుతోంది.

దలై లామా వారసత్వం మత పరంగా ఉండాల్సినదే అయినా, చైనా దీనిని రాజకీయంగా మలచేందుకు ప్రయత్నిస్తుండటం ఇప్పుడు బౌద్ధ మత విశ్వాసుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కొద్దిరోజులుగా చైనా అధ్యక్షుడు జీ పింగ్ సైతం కనిపించట్లేదేన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ ఎలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తుందోనని భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడీ అంశం అంతర్జాతీయంగా అగ్గి రాజేస్తోంది.
Share this article with your friends and family. Follow OG News for more interesting stories!