Microsoft: ప్రపంచ టెక్ రంగాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తూ, టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీ స్థాయిలో ఉద్యోగాల లేఆఫ్స్ చేపట్టింది. తాజా సమాచారం ప్రకారం, సంస్థ ప్రస్తుత ఉద్యోగుల్లో ఏకంగా 9వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 4శాతం. ఇప్పటికే గత మూడేళ్లుగా పలు దఫాలుగా లేఆఫ్స్ ప్రకటిస్తూ.. ఉద్యోగుల్ని తొలగించుకుంటూ వస్తుండగా.. బుధవారం 9వేల ఉద్యోగాల కోతతో మరో బాంబు పేల్చింది.
ఇది గత కొద్ది నెలల్లో మైక్రోసాఫ్ట్ చేపట్టిన మూడో దఫా తొలగింపు కావడం గమనార్హం. ఇదే ఏడాది మేలో కంపెనీ 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, ఇప్పుడు ఏకంగా 9వేల మంది రోడ్డునపడటంతో టెక్ రంగంలో ఆందోళన మొదలైంది.
కారణమేంటంటే..?
మైక్రోసాఫ్ట్ ఈ ఉద్యోగాల కోతకు వ్యూహాత్మక సంస్కరణలు, ఏఐ ఆధారిత సాంకేతికతపై దృష్టి పెట్టడమే కారణమని తెలుస్తోంది. క్వాలిటీ వర్క్‌ను పెంచేందుకు ఎక్కువగా ఏఐ టూల్స్‌పై ఆధారపడటంతో పాటు ఫేక్ ఎక్స్పీరియన్సులూ, ధ్రువీకరణ పత్రాలు, నైపుణ్యాల లేమి, ట్రెండ్‌కు తగ్గట్టు ఉద్యోగులు అప్డేట్ అవకపోవడం వంటివి కారణలని సంస్థ పేర్కొంటోంది. సంస్థ గత రెండేళ్లలో Generative AI, Azure Cloud, Bing Chat, GitHub Copilot వంటి ప్లాట్‌ఫారాలపై బలంగా దృష్టి పెట్టింది. ఈ దిశగా మరింత పెట్టుబడులు పెంచానుకోవడంతో.. అవసరమైతే ఖర్చులు తగ్గించుకోవాలన్నదే సంస్థ వాదన.
గేమింగ్ డివిజన్ (Xbox) పై తీవ్ర ప్రభావం
ఈసారి మైక్రోసాఫ్ట్ తొలగింపుల ప్రభావం ప్రధానంగా గేమింగ్ విభాగంపై ఎక్కువగా పడింది. ముఖ్యంగా Xbox Game Studiosలోని ZeniMax, King, Rare, Activision Blizzard వంటి అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులను ఎక్కువశాతం తొలగించినట్టు తెలుస్తోంది. అంతేగాక, “Everwild” పేరుతో Rare డెవలప్ చేస్తున్న గేమ్‌ను పూర్తిగా రద్దు చేసినట్టు సమాచారం. దీనికయ్యే ఖర్చు సంస్థకు కలిసిరానుంది. Xbox చీఫ్ ఫిల్ స్పెన్సర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. “వనరుల సంస్థ వ్యూహాలను మరింత సమర్థంగా రూపొందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం” అని పేర్కొన్నారు.

లాభాల్లో ఉన్నా ఉద్యోగాల కోత..
గత త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ ఆదాయంలో 17 శాతం వృద్ధి నమోదైంది. అయినప్పటికీ ఉద్యోగాల తొలగింపుకు కారణం ఖర్చుల నియంత్రణ. కంపెనీ CEO సత్య నాదెళ్ల ఇప్పటికే పేర్కొన్నట్లు, “AI age” ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యుగంలో పోటీకి తగిన మౌలిక వసతుల కల్పన కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. ఈ నిర్ణయంతో ఉద్యోగ భద్రతపై నూతన చర్చ మొదలైంది. ఇప్పటికే అమెరికా, యూరప్, ఇండియా తదితర దేశాల్లోని అనేక మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్ ఎలా స్పందించింది?
తాజా తొలగింపుల వార్తల తర్వాత కూడా మైక్రోసాఫ్ట్ స్టాక్‌లో పెద్దగా ఒడిదుడుకులు కనిపించలేదు. పెట్టుబడిదారులు దీన్ని ఒక పాజిటివ్ స్ట్రాటజీగా చూస్తున్నారు. దీర్ఘకాలంగా చూస్తే, కంపెనీ AI, క్లౌడ్ రంగాలలో మరింత ఆధిపత్యం ఏర్పరచే అవకాశం ఉంది.
మైక్రోసాఫ్ట్ తీసుకున్న తాజా ఉద్యోగాల తొలగింపు నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తున్నా.. ఉద్యోగులు తేరుకోకుంటే నష్టం తప్పదని నిపుణుల అభిప్రాయం. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ట్రెండ్‌కు తగ్గట్లు మార్కెట్లో ఉన్న కొత్త సాంకేతికతలు నేర్చుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవడం శ్రేయస్కరమని చెబుతున్నారు.