Bigg Boss: తెలుగు ప్రేక్షకులను ప్రతి సీజన్‌లో ఆకట్టుకుంటూ వస్తున్న బిగ్‌బాస్ షో ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. సీజన్ 9తో బిగ్‌బాస్ మళ్లీ తెరపైకి రాబోతుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే… ఇప్పటివరకు సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షోలో, ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పించనున్నారు. అంటే ఒకప్పుడు టీవీలో చూసే, ఓటింగ్ చేసే కామన్ మనుషులే… ఇప్పుడు హౌస్‌లోకి అడుగు పెట్టే చాన్స్‌కి అర్హులయ్యారు.
బిగ్‌బాస్ షోను మళ్ళీ హోస్ట్ చేయబోతున్న నాగార్జున తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “ఈసారి బిగ్‌బాస్ హౌస్ ఒక రంగస్థలం కాదు, ఒక రణరంగం!” అని ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రోమోను చూస్తేనే ఈసారి హౌస్‌లో నడిచే యాక్షన్, డ్రామా, భావోద్వేగాల తాకిడి ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించవచ్చు.
సాధారణ జనం కూడా ఇంటి సభ్యులవొచ్చు..
ఈసారి బిగ్‌బాస్ టీమ్ ఓ సరికొత్త ఫార్మాట్‌ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులకు కూడా ఈ షోలో పాల్గొనాలనుకునే అవకాశం అందించనున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ కావాలనుకునే వారు, ఒక చిన్న వీడియోను సిద్ధం చేసి షేర్ చేయాల్సి ఉంటుంది. అందులో “నేను బిగ్‌బాస్‌లో ఎందుకు ఉండాలనుకుంటున్నాను?” అనే అంశాన్ని స్పష్టంగా వివరించాలి. అలా ఎంపికైన కొంతమంది కామన్ పీపుల్‌కి సెలెబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు హౌస్‌లోకి వచ్చే అవకాశం లభిస్తుంది.
Apply now: https://bb9.jiostar.com
ఈ కొత్త విధానం బిగ్‌బాస్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు టీవీలో మాత్రమే చూస్తూ ఉన్న వారు, ఇప్పుడు స్వయంగా షోలో పాల్గొనాలన్న ఆశకు ఊతమిచ్చేలా ఇది ఉంది. ఇక షో ప్రారంభ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదైనా, ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో ప్రసారం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీల మధ్య గొడవలు, ప్రేమ కథలు, గేమ్ టాస్కులు, ఉద్వేగాల మేళవింపు అన్నీ చూసిన ప్రేక్షకులకు… ఈసారి కామన్ మెంటాలిటీ ఉండే వాళ్లు ఎలా వ్యవహరిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ఫార్మాట్ వల్ల షోకి మరింత వైవిధ్యం, జనాభిప్రాయానికి దగ్గరగా ఉండే ఫీలింగ్ వచ్చేలా ఉంది.
మళ్లీ ట్రెండ్ మొదలైంది..
ఇకపోతే, సోషల్ మీడియాలో కూడా బిగ్‌బాస్ 9 గురించి ఇప్పటికే ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎవరు ఈసారి పార్టిసిపేట్ చేస్తారో, ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం వినోదం మాత్రమే కాదు… సామాన్యుల జీవితాలకు సంబంధించి కొన్ని విలువైన కోణాలను కూడా ఈసారి షో హైలైట్ చేసే అవకాశముంది.
మొత్తానికి, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 – వినోదాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయోగంగా మారబోతోంది. కామన్ ప్రజలకి ఛాన్స్ ఇవ్వడం ద్వారా షోకి మరింత విశ్వసనీయతను, ఆకర్షణను తీసుకురావడం ఖాయం. షో ప్రారంభానికి ముందే ఆసక్తిని పుట్టించిన బిగ్‌బాస్ 9… ఈసారి మరింత హైపుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.