Railway: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గత మూడేళ్లలో అనేక సవాళ్లను అధిగమించి గణనీయమైన ఆర్థిక ప్రగతిని సాధించింది. 2022-23 నుంచి 2024-25 మధ్యకాలంలో ప్రయాణికుల చార్జీలు మరియు సరుకు రవాణా ద్వారా మొత్తం రూ.59,884 కోట్ల ఆదాయాన్ని సంపాదించి, భారతీయ రైల్వే బోర్డులో తన సామర్థ్యాన్ని చాటుకుంది. ప్రధానంగా సరుకు రవాణాపై దృష్టి పెట్టిన దక్షిణ మధ్య రైల్వే, గత మూడేళ్లలో రూ.40,535 కోట్లు సంపాదించగా, ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.19,349 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఈ కాలంలో 2022-23లో రూ.18,976 కోట్లు, 2023-24లో రూ.20,339 కోట్లు, 2024-25లో రూ.20,569 కోట్ల ఆదాయం రైల్వే ఖాతాలోకి చేరింది.
సరకు రవాణాతో పెరిగిన ఆదాయం!
ప్రయాణికుల చార్జీల కంటే సరుకు రవాణా ద్వారానే ఎస్‌సీఆర్ మూడు రెట్లు ఎక్కువ ఆదాయం పొందింది. 2022-23లో 131.8 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రూ.13,051 కోట్లను సంపాదించగా, 2023-24లో 141.1 మిలియన్ టన్నుల సరుకుతో రూ.13,620 కోట్ల ఆదాయం వచ్చిందీ. తాజాగా 2024-25లో 144.1 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రూ.13,864 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే రాబట్టింది. సరుకు రవాణాలో ఈ స్థాయి ప్రగతిని సాధించడంలో కీలకంగా మారింది మౌలిక సదుపాయాల విస్తరణ. 960 కిలోమీటర్ల మేర డబ్లింగ్, ట్రిప్లింగ్‌తో పాటు కొత్త రైలు మార్గాలను ప్రారంభించడం ద్వారా రవాణా సామర్థ్యాన్ని విస్తరించగలిగింది.
📊 సరుకు రవాణా vs ప్రయాణికుల ఆదాయం
కాలం | సరుకు (లక్ష టన్నులు) | సరుకు ఆదాయం (₹ కోట్లు) | ప్రయాణికుల ఆదాయం (₹ కోట్లు) |
---|---|---|---|
2022‑23 | 131.8 | ₹13,051 | ₹5,925 (గణనగా) |
2023‑24 | 141.1 | ₹13,620 | ₹6,719 (అంచనా) |
2024‑25 | 144.1 | ₹13,864 | ₹6,705 (మొత్తం ₹20,569–₹13,864) |

అందరి కృషితోనే..
ఈ సందర్భంగా ఎస్‌సీఆర్ జోన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, గత మూడేళ్లలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించామని, సమష్టిగా పని చేసిన అధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగులు, కార్మికుల కృషి వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పారు. కొత్త రైలు ప్రాజెక్టుల్లో భాగంగా గుడూరు వద్ద 2.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్, కాజీపేట వద్ద రైలు అండర్ రైలు నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామని, రవాణా సామర్థ్యం పెరిగిందన్నారు.