Telangana: తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని బాన్సువాడ డివిజన్ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి రవీందర్ చౌహాన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని జనసైనికులకు ఆదివారం ఆయన పార్టీ సభ్యత్వ పత్రం, ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ప్రజలు, ప్రగతే ఆయనకు తొలి ప్రాధాన్యమన్నారు. అదే 100శాతం స్ట్రైక్ రేట్‌తో గెలుపును అందించి నేడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఆయన్ను నిలబెట్టాయన్నారు.
తెలంగాణలోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదర్శంతో చాలామంది యువత పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజవకర్గ జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.