Telangana: రాష్ట్రంలో మరో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటి నుంచి వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల మేరకు భర్తీ చేపడుతోంది రేవంత్ సర్కారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 పోస్టుల భర్తీకి శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఖాళీల లెక్కింపు పూర్తయినట్లు సమాచారం. త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందని విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ప్రభుత్వం సైతం అధికారిక ప్రకటన చేసింది. ప్రకటనలో తేదీ, షెడ్యూలు వెల్లడించకపోయినా.. ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అంతర్గత సమాచారం. పంచాయతీ ఎన్నికలకు ముందే ఈ నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికలు పూర్తవగానే పరీక్షలు ఉండే అవకాశం ఉంది.
మొత్తం ఖాళీలు ఇలా:
డిస్కంల్లో (TSNPDCL, TSSPDCL): 4,175 పోస్టులు
జెన్‌కోలో: 703 పోస్టులు
ట్రాన్స్‌కోలో: 490 పోస్టులు
ఈ మూడు విద్యుత్ సంస్థల్లో కలిపి 5,368 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఎవరు అర్హులు?
ఈ ఉద్యోగాలకు బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీటెక్ / బీఈ అభ్యర్థులకు – అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులు
డిప్లొమా అభ్యర్థులకు – సబ్ ఇంజనీర్ (SE) పోస్టులు
ఐటీఐ అభ్యర్థులకు – జూనియర్ లైన్ మన్ (JLM), టెక్నీషియన్ పోస్టులు

గత నియామకాల ఫార్మాట్ ఎలా ఉండేది?
తెలంగాణలో గతంలో జరిగిన విద్యుత్ సంస్థల రిక్రూట్మెంట్‌లో ముఖ్యంగా మూడు విభాగాల్లో పరీక్షలు జరిగాయి.
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పరీక్ష:
సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు
జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్
సబ్ ఇంజనీర్ (SE) పరీక్ష:
డిప్లొమా స్థాయిలో సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు
జనరల్ నాలెడ్జ్, బేసిక్ ఇంగ్లీష్, మ్యాథ్స్
జూనియర్ లైన్ మన్ (JLM) పరీక్ష:
ఐటీఐ స్థాయి సబ్జెక్ట్ ప్రశ్నలు
ఫిజికల్ టెస్ట్ కూడా నిర్వహించారు (పోల్స్ ఎక్కడం, ఫిజికల్ ఎండ్‌రెన్స్ టెస్ట్)
సిలబస్ : పూర్వం నిర్వహించిన విద్యుత్ సంస్థల పరీక్షల్లో..
ఏఈ, ఎస్ఈ పోస్టులకు: సబ్జెక్ట్ మీద 80% ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద 20% ప్రశ్నలు.
జేఎల్ఎమ్ పోస్టులకు: ఐటీఐ సంబంధిత సబ్జెక్ట్, ఫిజికల్ టెస్ట్ అత్యంత కీలకం.
ఈ సిలబస్ ఆధారంగా అభ్యర్థులు ఇప్పటికే సిద్ధమవ్వడం ప్రారంభించాలి. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సరైన ప్రిపరేషన్‌కి సమయం తక్కువ ఉండే అవకాశం ఉంది.
అభ్యర్థులకు సూచనలు
తెలంగాణలో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీ సాధారణంగా తక్కువ ఉండదు. గతంలో జరిగిన పరీక్షల ఆధారంగా చూస్తే వేలాది మంది దరఖాస్తు చేసుకోవడం వల్ల కాంపిటీషన్ తీవ్రమైంది. గత రిక్రూట్మెంట్‌లలో ఆన్‌లైన్ పరీక్షలు, ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇచ్చారు. ప్రత్యేకించి విద్యుత్ సంబంధిత ప్రాథమిక సూత్రాలు, ఫార్ములాలు, అప్లికేషన్స్‌పై ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి.
అందుకే అభ్యర్థులు ఇప్పటి నుంచే గత ప్రశ్నాపత్రాలు చదవడం, సబ్జెక్ట్ బేసిక్‌లపై పట్టు సాధించడం ప్రారంభించాలి.
గతంలో నిర్వహించిన విద్యుత్ సంస్థల పేపర్లు, సిలబస్, మాక్ టెస్టులు పైన ఫోకస్ చేయాలి.
ఫిజికల్ టెస్ట్ ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఫిజికల్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించాలి.
త్వరలో నోటిఫికేషన్ – అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ శాఖ వర్గాల ప్రకారం, ప్రస్తుతం ఖాళీల వివరాలు తుది నిర్ణయం దశలో ఉన్నాయి. ఈ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కచ్చితంగా ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వెలువడి.. ఎన్నికల తర్వాత పరీక్షలుంటాయి. అభ్యర్థులు విద్యుత్ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లు, ప్రభుత్వ నియామక ప్రకటనలపై నిత్యం దృష్టి పెట్టాలి. ఈ నియామకాలు యువతకు మంచి అవకాశంగా మారనున్నాయి. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి సమాచారం మేము మీకు అందించేందుకు సిద్ధంగా ఉంటాం. ఫాలో ఓజీ న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్‌డేట్స్.
Latest Government Jobs Telangana | Job Notification Telangana | Jobs in Electric Department Notification 2025