Tobacco: పొగాకు నియంత్రణలో అసాధారణ కృషి చేస్తున్న తెలంగాణకు చెందిన ఓ అధికారికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. దాదాపు 20 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా వినూత్న మార్గాల్లో పొగాకు వినియోగాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు తెలంగాణ పౌర సరఫరాల శాఖలో డీటీగా పనిచేస్తున్న మాచన రఘునందన్. అంతర్జాతీయ శాస్త్రీయ విజ్ఞాన పత్రిక సైన్‌టెక్ ఆయన సేవలను ప్రశంసించింది. పొగాకును వినియోగాన్ని కట్టడి చేయడంలో ఆయన సేవలు నిరుపమానమని.. రఘునందన్ కారణజన్ముడంటూ శ్లాఘించింది.
ప్రపంచ దేశాల్లో ఉన్న వైద్యుల పరిశోధనలు ప్రచురించే పల్మనరీ మెడిసిన్ పత్రిక మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న వారి గురించి వివరాలు సేకరించింది. క్యాన్సర్ మహమ్మారి నియంత్రణ, చికిత్సలకై కృషి చేస్తున్న వైద్యుల పరిశోధనలను ఈ పత్రిక ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా “మాచన రఘునందన్ ద టుబాకో కంట్రోల్ మిషన్” అనే అంశం పై సైన్టెక్ (scintech) సమీక్ష చేసింది.సమాజ హితం కోరుతూ ఒక వ్యక్తి పొగాకు నియంత్రణ కోసం ఓ సైనికుడు గా మారాడని ప్రస్తుతించింది.

20 ఏళ్లలో పొగాకు నియంత్రణ కు అలుపెరుగని, నిర్విరామ కృషి చేసిన మాచన రఘునందన్ సమాజ చికిత్స చేస్తున్న వైనం..అద్వితీయం, అమోఘం అని సైన్టెక్ కొనియాడింది. రఘునందన్ కృషిని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలని గూగుల్ లో సైతం పొందుపరచింది. ఇలా ఓ సామాన్యుడి అసామాన్య కృషి ని గూగుల్ వేదిక గా జన బాహుళ్యానికి చేరేలా ఉంచడంతో పాటు, ఈ సంస్థ నుంచి ప్రశంసలుందుకు తెలుగు వ్యక్తిగా రఘునందన్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆయన పొగాకుపై చేస్తున్న పోరాటానికి గతంలోనూ అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రశంసలు దక్కడం గమనార్హం.
ఈ సందర్భంగా మాచన రఘునందన్ స్పందిస్తూ.. “ఏం నీకేం పని పాట లేదా.. దారిన పోయే వాళ్లను పట్టుకుని బీడీ తాగకు, సిగరెట్ మానెయ్ అని చెప్తావ్‌ష అని స్నేహితులతో పాటు అయినవాళ్లూ చాలామందే అన్నా పట్టువదలక ఈ పనిని బాధ్యతగా చేస్తున్నానన్నారు. పొగాకును పూర్తిగా నిర్మూలించేవరకు ఈ సంకల్పం ఇలాగే కొనసాగుంతుందని స్పష్టం చేశారు.
No Tobacco, Interntional Journal, Tobacco Activist, Telangana, Tobacco