Haircut రూ.1800.. ఫారెన‌ర్‌కి ఇండియా సెలూన్‌లో షాక్‌!

shock to foreigner in Indian salon

Share this article

India: భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన ఓ విదేశీయుడికి షాకిచ్చాడో సెలూన్ నిర్వాహ‌కుడు. ప‌ర్య‌టన మ‌ధ్య‌లో క‌టింగ్ కోసం సెలూన్ కు వెళ్లిన ఆ విదేశీయుడికి.. 10 నిమిషాల క‌టింగ్ త‌ర్వాత ఏకంగా రూ.1800 వ‌సూలు చేశాడు. సాధార‌ణ క‌టింగ్‌కి దేశ‌వ్యాప్తంగా రూ.150 ఛార్జ్ చేస్తుండ‌గా.. ఇక్క‌డ ప‌దింత‌లు వ‌సూలు చేయ‌డంపై స‌ద‌రు విదేశీయుడు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ఓ వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

అసలు వీడియోలో ఏం ఉంది?
వీడియోలో జార్జ్ బెక్ అనే ఓ ట్రావెల‌ర్‌.. భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఓ సెలూన్‌కి వెళ్లినట్లు కనిపిస్తుంది. కట్ పూర్తయ్యాక, ఎంత అని అడ‌గ్గా.. సెలూన్ నిర్వాహ‌కుడు ఆయనకు రూ. 1800 అని చెబుతాడు. దానికి విదేశీయుడు.. ఎందుకు ఇంత‌.. ఇది చాలా బేసిక్ క‌టింగ్ క‌దా అని ప్ర‌శ్నించ‌గా.. బ‌దులుగా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు స‌ద‌రు సెలూన్ నిర్వాహ‌కుడు. ఇది వీఐపీ క‌ట్‌, స్టైల్ క‌ట్ అని ఒక‌రు.. మీరు విదేశీయుడు కాబ‌ట్టి స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నామంటూ ఒక‌రు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఈ వీడియోలో క‌నిపిస్తుంది. చివ‌రికి రూ.1200 ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్లు బెక్ ఈ వీడియోలో వెల్ల‌డించాడు. అయితే, త‌ను రూ.150 నుంచి రూ.200 మ‌ధ్య ఛార్జ్ చేసి ఉంటే దానికి ప‌దింత‌ల టిప్ ఇద్దామ‌నుకున్నానంటూ స‌ద‌రు ఫారెన‌ర్ చెప్ప‌డం విశేషం.

నెటిజ‌న్ల మండిపాటు..
వీడియోకి రిప్లైగా వచ్చిన కామెంట్లలో నెటిజ‌న్లు.. “ఇలాంటి సంఘటనల వల్లే భారతదేశం మీద చెడు అభిప్రాయాలు వస్తుంటాయి అంటూ కొంద‌రు. ఇది టూరిస్టుల‌ను ఎక్స్‌ప్లోటేష‌న్ చేయ‌డ‌మే కాదు మోసం చేస్తున్న‌ట్ట‌ని కొంద‌రు స్పందిస్తున్నారు. ఈ సెలూన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొంద‌రు కోరుతున్నారు. 24గంటల్లోనే ఈ వీడియోకి 2 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ రావ‌డం గ‌మనార్హం.

సంఘాల క్ష‌మాప‌ణ‌..
ఈ ఘటనపై స్పందించిన కొంతమంది సెలూన్ యజమానులు & హెయిర్‌స్టైలిస్ట్ సంఘాలు – “ఇది ఇండస్ట్రీకి చెడు పేరు తెచ్చే చర్య, మా తరఫున మాఫీ కోరుతున్నాం” అని ప్ర‌క‌టించారు. .

ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈ సెలూన్ ఏ రాష్ట్రంలో ఉందన్న విషయం స్పష్టంగా తెలియలేదు. కొన్ని వర్గాలు ఇది ఉత్తర భారతదేశంలో జరిగిన సంఘటన అని, మరికొందరు ఇది గోవా ప్రాంతంలో అని అంచనా వేస్తున్నారు. అయితే వీడియోలో దుకాణం బోర్డు, మాట్లాడే శైలి ఆధారంగా ఇదేదో చిన్న ప‌ర్యాట‌క ప్రాంతంగా క‌నిపిస్తోంది.

Viral video, Today Trending, India, Travel vlogs, Tourists

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *