Tollywood: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సంబంధించి తాజా అప్డేట్ ను సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది.

‘విశ్వంభర’ చిత్రానికి ‘బింబిసార'(Bimbi Sara) ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఓ అప్డేట్ ఇప్పుడు మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ తాజా అప్డేట్‌ను వెల్లడించింది. ఈ పాట విడుదల తేదీ మరియు ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ పాట చిరంజీవి అభిమానులలో భారీ అంచనాలను నెలకొల్పింది.
ఆలస్యంగానే తెరపైకి..
ముందుగా ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో గ్రాఫిక్స్‌పై వచ్చిన విమర్శలను ఎదుర్కొనేందుకు, హైదరాబాద్ మరియు హాంకాంగ్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్‌ను మెరుగుపరుస్తున్నారు. తద్వారా చిత్ర విడుదలపై స్పష్టత రావడానికి ఇంకా సమయం పడే అవకాశం ఉంది.

భారీ అంచనాలు..
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. సినిమా టీజర్ ఇప్పటికే అభిమానుల్లో ఆశలు రేకెత్తించగా.. ఫస్ట్ సింగిల్ విడుదల ప్రకటనలతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. చిరంజీవి నటన, వశిష్ట దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీతం కలయిక ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయని అభిమానులు భావిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఫస్ట్ సింగిల్ ఏమాత్రం ఆకట్టుకోనుందే ఇక చూడాల్సిందే.
Tollywood News, Megastar Chiranjeevi, Trisha, MM Keeravani, Vishwambara