Hyderabad: తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో కార్మిక నైపుణ్యం సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ (హాకీంపేట) మరియు వరంగల్ (ములుగు రోడ్)లోని RTC ITI కళాశాలలు వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి.
ఈ సంవత్సరం మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ వంటి ప్రధాన ట్రేడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలోనే ప్రాక్టికల్ ట్రైనింగ్ (Apprenticeship) సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇదొక ప్రత్యేక అవకాశం – చదువుతున్నప్పుడే పని అనుభవాన్ని కూడా పొందే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.
ఐటీఐ ద్వారా విద్యనభ్యసించిన విద్యార్థులు స్వయం ఉపాధి రంగంలో స్థిరపడే అవకాశమున్నదని, స్వతంత్రంగా గ్యారేజీలు, వర్క్‌షాపులు నిర్వహించగలగడం, పారిశ్రామిక రంగాల్లో స్థిర ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. టీజీఎస్‌ఆర్టీసీ ఈ ఐటీఐ కళాశాలలను, యువతకు శిక్షణతో పాటు భవిష్యత్‌కు బంగారు మార్గం చూపించే లక్ష్యంతో ఏర్పాటు చేసింది.
ప్రవేశానికి అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 21, 2025లోగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్:
🌐 https://iti.telangana.gov.in
దరఖాస్తుదారులు మరిన్ని వివరాల కోసం సంబంధిత ఐటీఐ కళాశాలలైన హైదరాబాద్ హాకీంపేట మరియు వరంగల్ ములుగు రోడ్లలోని RTC ITIలను నేరుగా సంప్రదించవచ్చు. అక్కడ ఆయా కోర్సుల గురించి, ఇంటర్వ్యూలు, సీట్ల లభ్యత తదితర సమాచారం పొందవచ్చు.