
Jagtial: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ శాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగ శ్రీనివాస్, పొనకాంటి కైలాసం, నక్క శంకర్, దూడ రాజు, కొమ్ము లక్ష్మణ్ , దసర్తి రాజేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు కమిట్మెంట్ ఉన్న నేత అని.. ఆయన నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో నూతన విధానాలతో పెట్టుబడులకు స్వర్గదామంగా తెలంగాణా అవతరించడంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు.