
క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం సినిమా(Drishyam Movie)ను తలపించే ఘటనే గుజరాత్(Gujarath)లో జరిగింది. తన ప్రియుడితో పారిపోయేందుకు తనలాగే ఓ వ్యక్తిని తయారుచేసి దహనం చేసిందో వివాహిత. గుజరాత్ రాష్ట్రంలోని జఖోట్రాకు చెందిన గీతా అహీర్కు గతేడాది పెళ్లయింది. అయితే పెళ్లికి ముందు నుంచే భరత్(21) అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇంట్లో వద్దని చెప్పినా వినకుండా పెళ్లి చేయడంతో.. తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ ఓ మాస్టర్ క్రైమ్ ప్లాన్ వేశారు.
పారిపోయిన తర్వాత తన గురించి ఎవరూ వెతక్కుండా ఉండేందుకు దృశ్యం సినిమా కథను అనుసరించారు. రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకి(56) అనే ఓ వ్యక్తిని హత్య చేశారు. మృతదేహానికి గీత దుస్తులు, గాజులు, కాలి పట్టీలు తొడిగి తగలబెట్టారు. కాలిన మృతదేహాన్ని తన భార్యే అనుకుని నమ్మిన భర్త.. కార్యక్రమాలు పూర్తి చేశాడు. అయితే, తర్వాత జరిగిన పోలీసుల విచారణ(Police Enquiry)లో ఆ మృతదేహం హర్జీభాయ్ది అని తేలడంతో.. గీత కోసం గాలింపు చేపట్టారు. ఓచోట భరత్, గీతలను అదుపులోకి తీసుకుని విచారించగా.. తామే అతన్ని హత్యచేసి కాల్చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఈ ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.