
Suryapet: సూర్యాపేటలో అక్రమ శిశు విక్రయాల(Child Trafficking) మాఫియా కలకలం సృష్టిస్తోంది. అంగట్లో సరకులా పసికందులను అక్రమంగా విక్రయిస్తున్న ఓ ముఠా ఆటకట్టించారు సూర్యాపేట పోలిసులు. ఈ ముఠా గత మూడేళ్లలో తెలంగాణా వ్యాప్తంగా 28 మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి తక్కువ ధరలకు శిశువుల్ని కొని.. ఇక్కడి సంతానం లేని దంపతులకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల దాకా విక్రయిస్తున్నారని సూర్యాపేట ఎస్పీ నరసింహ వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కేసు వివరాల్ని ఆయన తెలిపారు.
సూర్యాపేట విద్యానగర్ ప్రాంతానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. సంతానం లేని దంపతుల వివరాలు సేకరించి.. పలు ప్రాంతాల నుంచి దత్తత తీసుకున్న, కొనుగోలు చేసిన చిన్నారులను అప్పగిస్తున్నారు. ఒక్కో శిశువుకూ రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల దాకా వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణా(telangana)వ్యాప్తంగా మూడేళ్ల వయసులోపు ఉన్న 28 మంది చిన్నారులను విక్రయించగా.. కేవలం నల్గొండలోనే 10మందిని విక్రయించినట్లు గుర్తించి వారిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా నుంచి టేకుమట్ల గ్రామానికి చెందిన అంజయ్య, నాగయ్యలు శిశువుల్ని దత్తత తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని విచారించగా ఈ దందా మొత్తం బయటపడింది. వీరిచ్చిన సమాచారం మేరకు పోలీసులు యాదగిరి, ఉమారాణిని అరెస్టు చేయగా.. మరో అక్రమ రవాణా గురించి సూర్యాపేట హైటెక్ బస్టాండులో వీరి ముఠా ఎదురుచూస్తోందని వీరిద్దరూ వాంగ్మూలం ఇచ్చారు. హైటెక్ బస్టాండుకు చేరుకున్న పోలీసులు మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్, రమా లక్ష్మి, పిల్ల పావణి, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, అచ్చంపేటకు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఐత శోభారాణి, రాజస్థాన్ కు చెందిన ఖాన్ షహీనా, హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన షహానా, హైటెక్‌సిటీకి చెందిన ఏర్పుల సునీతను అరెస్టు చేశారు. అయితే వీరిందరిపై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్లలో శిశు విక్రయ కేసులు నమోదైనట్లు విచారణలో తేలినట్లు ఎస్పీ వెల్లడించారు.
దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేయనున్నాయని ఎస్పీ తెలిపారు. త్వరలోనే దీని వెనకున్న అందరినీ పట్టుకుంటామని చెప్పారు.
జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నారు. సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని.. వారికి శిశువుల్ని విక్రయిస్తున్నా
సూర్యాపేట జిల్లా కేంద్రంగా అక్రమంగా పసికందులను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులు,