
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్(Test Cricket) ఆడనున్న భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) జాబితాను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్(Shubman Gill) నాయకత్వం వహించనుండగా.. రిషబ్ పంత్(Rishab Panth)ని వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.
యువ ఆటగాళ్లు యశశ్వి జైస్వాల్(Yasaswi Jaiswal), ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్ దీప్తో సహా రవీంద్ర జడేజా(Jadeja), జస్ప్రీత్ బుమ్రా(Bumra), మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, కరణ్ నాయర్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించారు. జూన్ 20న బ్రిటన్‌లోని హెడింగ్లీలో ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్టుల సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టు పాల్గొననుంది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ బృందం, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ ఈ జట్టును ప్రకటించారు.