మైసూర్ ‘పాక్’ కాదు.. మైసూర్ ‘శ్రీ’!

Share this article

India Pakistan: క‌శ్మీర్‌(Kashmir)లో ఉగ్ర‌దాడి(Terror Attack)తో దాయాది పాక్ పేరెత్తితేనే మండిప‌డిపోతోంది దేశం. సామాజిక మాధ్యమాలు, మీడియాతో పాటు బ‌హిరంగంగానే ఒక్కొక్క‌రూ ఒక్కో రీతిలో త‌మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ దేశం జెండాలు రోడ్ల‌పై అతికించ‌డం.. వ్య‌తిరేక పోస్ట‌ర్లు త‌ర‌చూ క‌నిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి సంద‌ర్భంలోనే జైపూర్‌కు చెందిన ఓ మిఠాయి వ్యాపారి చేసిన ప‌ని ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న మిఠాయిల దుకాణంలో పాక్ అనే పేరుతో ఉన్న ప్ర‌తీదానీ పేరును మార్చేశారు ఆ వ్యాపారి. ‘పాక్’ పేరుతో ఉన్న మిఠాయి చివ‌ర్లో ‘శ్రీ’ని పెట్టి అమ్ముతున్నారు. దేశం మొత్తం ఇదే పాటించాల‌ని కోరుతున్నారు.

Mysore Pak to Mysore Shree

రాజ‌స్థాన్‌లోని జైపూర్‌(Jaipur Sweet shop) కు చెందిన ఓ వ్యాపారి.. త‌న స్వీట్ల దుకాణంలో ఉన్న మైసూర్ పాక్(Mysore pak) ని మైసూర్ శ్రీ(Mysore Shree)గా.. మోతీ పాక్‌(Mothi Pak)ను మోతీ శ్రీ(Mothi Shree)గా, గోండ్‌పాక్‌ని గోండ్ శ్రీగా మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సాధార‌ణంగా పాక్ అనే ప‌దానికి క‌న్న‌డ భాష‌(Kannada Language)లో అర్థం తీపి(Sweet) ప‌దార్థ‌మ‌ని. ఇక్క‌డ పుట్టిన స్వీట్లకు దాదాపుగా చివ‌ర్లో పాక్ క‌నిపిస్తుంది. అవే దేశ‌వ్యాప్తంగా వాడుక‌లోకి వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధం, భార‌తీయ హిందువుల‌పై ఉగ్ర‌దాడి వేళ ఆ పేరును తొల‌గిస్తూ ఈ వ్యాపారి తీసుకున్న నిర్ణయానికి సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. మంచి ప‌ని చేశారంటూ కితాబులందుతుండ‌టం గ‌మ‌నార్హం.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *