
Telangana: తెలంగాణా సర్కారు నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు(Government Jobs) సాధించాలనే నిరుద్యోగుల కల ఏళ్లుగా అలాగే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ లేకపోగా.. వచ్చిన నోటిఫికేషన్లూ(Job Notifications) కోర్టు కేసులతో ఆగిపోయాయి. ఇదే ప్రధాన అజెండాగా ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ సర్కారు(Congress Government).. పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు కొత్త నోటిఫికేషన్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు దశల్లో విద్యాశాఖ, ఇరిగేషన్, పోలీస్ శాఖ (Police Recruitment)లతో సహా ఖాళీలున్న ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో భర్తీలు పూర్తి చేస్తూ వస్తోంది. అయితే, మరోసారి ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసుల ద్వారా దాదాపు 1500కు పైగా పోస్టులు (1500 posts) భర్తీ చేయనుంది. ఈమేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ (టీజీపీఎస్సీ TGPSC) ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి పనులన్నీ పూర్తవగా.. జూన్ 2న తెలంగాణా అవతరణ దినోత్సవ(Telangana Formation Day) వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ ప్రకటన చేయొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు, పరీక్షలు, భర్తీ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నారు.
పోస్టులు:
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)
జూనియర్ అకౌంటెంట్ (Junior Accountant)
జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant)
స్టెనోగ్రఫర్, టైపిస్టు.. తదితరాలు (Stenographer)
అర్హతలు:
గ్రూప్ 3: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Any Degree)
గ్రూప్ 4: ఇంటర్మీడియట్, డిగ్రీ.. పోస్టును అనుసరించి (Intermediate/Degree)
వయసు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు (రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంది)
ఎంపిక విధానం:
గ్రూప్ 3: (Group 3)
3 పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది.
పేపర్ 1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ (150 మార్కులు)
పేపర్ 2: హిస్టరీ, పాలిటీ, సొసైటీ (150 మార్కులు)
పేపర్ 3: ఎకానమీ మరియు అభివృద్ధి (150 మార్కులు)
ఒక్కో పేపర్‌కు 150 ప్రశ్నలు, 150 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
మొత్తం 450 మార్కుల్లో ఎక్కువ మెరిట్ అభ్యర్థులను షార్ట్ లిస్టు ద్వారా తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. పరీక్ష తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
గ్రూప్ 4: (Group 4)
రాత పరీక్ష – ఓఎంఆర్ – ఆబ్జెక్టివ్ టైప్ (Written Test)
స్కిల్ టెస్ట్ – (టైపిస్టు, స్టెనో పోస్టులకు) (Skill Test)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification
ఎలా దరఖాస్తు చేయాలి..? (How to Apply?)
- నోటిఫికేషన్ వెలువడిన అనంతరం.. టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in లోనికి వెళ్లండి.
- అప్లై ఆన్లైన్ ఫర్ గ్రూప్ 3/4 (Group 3, Group 4) ని ఎంచుకోండి
- మీ వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
- దరఖాస్తు ఫారం నింపి.. సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుము చెల్లించండి
- సబ్‌మిట్ చేసిన దరఖాస్తును ప్రింట్ చేసి పెట్టుకోండి.
ఆల్ ది బెస్ట్!
(Group 3 Notification) (Group 4 Notification) Apply TSPSC