నల్లమోతు శ్రీధర్.. టెక్నాలజీ పరిచయమున్న ఎవరికైనా కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ విషయమైనా సునిశిత పరిశోధన తర్వాతే విశ్లేషించడం.. ఏ సందర్భమైనా అసలు నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పడం.. ఏ మాటైనా ఎంతటి వారికైనా అర్థమయ్యేలా వివరించడంలో నేర్పరి. గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టిన ఆయన.. సనాతనం, వేదాలు, మంత్రాలతో సహా మనకు ఉపయోగపడే ఎన్నో విషయాలను ప్రయోగాత్మకంగా పంచుకుంటున్నారు. ఆ విషయాలన్నీ మన ఓజీ రీడర్స్కి అందించాలనే ఆలోచనతో.. ఆయన మాటల్ని ఏ మార్పూ లేకుండా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

———-
కాళీ మంత్రం ఒక మనిషి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో స్టడీ చేశాను.
కాళీ మంత్రం లేదా ఇతర ఏ మంత్రం అయినా మన మెంటల్ బాడీ (మనోమయ కోశం), ఎనర్జీ బాడీ (శక్తిమయ కోశం), కాన్షియస్నెస్ మీద శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

సహజంగా కాళీ మంత్రం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవి.
- భయాలను తొలగిస్తుంది:
బయట అన్నిచోట్లా ఈ వాక్యం చదవగానే “ఓ మంత్రంతో భయం ఎలా పోతుంది” అని చాలామంది ఓ నవ్వు నవ్వుకుంటారు. సాధన చెయ్యకుండా, స్వయంగా అనుభవించకుండా మైండ్ లెవల్ జడ్జ్మెంట్లు మన ఇంటలెక్ట్ని నాశనం చేస్తాయి. భయం ఎలా పోతుంది అని నేను స్వయంగా స్టడీ చెయ్యడం మొదలుపెట్టాను. కాళీ మంత్రం పఠించేటప్పుడు నా శరీరంలో ఎక్కడ శక్తి ప్రవహిస్తుందో, ఎక్కడ స్థంభిస్తుందో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఓ స్థితిలో శ్వాస స్థంభించడం గమనించాను.
ఆ తర్వాత అర్థమైంది.. కాళీ మంత్రం పఠించేటప్పుడు “కేవల కుంభక” అనే ప్రక్రియ జరుగుతుందని రకరకాల సోర్సెస్ ద్వారా లోతుగా స్టడీ చేసేటప్పుడు అర్థమైంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే.. మన శరీరాన్ని ప్రయోగశాలగా మార్చుకోవాలి, మన శరీరమే ఓ పెద్ద ఎనర్జీ ఫీల్డ్. శక్తి ప్రవాహంలో, భావోద్వేగ స్థితి గతుల్లో వచ్చే చిన్న చిన్న మార్పులు పసిగట్టగలిగే సాధన మెడిటేషన్ ద్వారా చేస్తే అన్నీ అర్థమవుతాయి.
భయం అనేది సింపథటిక్ నెర్వస్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసే ఎమోషన్. శరీరం మొత్తం రక్తప్రసరణ, శ్వాస తీసుకునే వేగం అన్నీ పెరుగుతాయి. ఈ మంత్రం సాధన సమయంలో కొన్ని లిప్తలపాటు శ్వాస స్థంభించడం వలన.. భయాన్ని సృష్టించే ఎమోషనల్ స్టేట్ దానితో అనుసంధానం అయిన అటానమస్ నెర్వస్ సిస్టమ్‌లో, శరీర ఉష్ణోగ్రత, రక్తప్రసరణ వంటి అన్నింటిలో మార్పు వస్తుంది. తద్వారా కాలక్రమేణా సాధన చేసుకుంటూ వెళితే భయం పోతుంది.

- నిగ్రహశక్తిని పెంపొందిస్తుంది:
నిగ్రహం ఎప్పుడు కావాలి? మైండ్ మన కంట్రోల్లో లేకపోతే ఆటోమేటిక్‌గా కావలసింది నిగ్రహం. మైండ్ ఎందుకు కంట్రోల్ తప్పుతుంది? హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ తప్పడం వల్ల అన్నది చాలా ఏళ్లుగా నా అండర్స్టాండింగ్లో ఉంది. కాళీ మంత్రం పఠించేటప్పుడు బ్రెయిన్లో encephalic synchronization అనేది ఒకటి జరుగుతుంది. పైకి శబ్ధంతో పఠించేటప్పుడు ఆ సౌండ్ వేవ్స్ మన బ్రెయిన్లోని ఎలక్ట్రో మాగ్నటిక్, న్యూరో కెమికల్ యాక్టివిటీతో ఇంటరాక్ట్ అవుతాయి.
దీని ఫలితం బ్రెయిన్ వేవ్ అప్పటి వరకూ సరిగా పద్ధతిగా లేనిది (EEG సెన్సార్లతో స్కాన్ చేస్తే కోహరెంట్గా లేని బ్రెయిన్ వేవ్స్ స్పష్టంగా కనిపిస్తాయి) ఒక్కసారిగా క్రమపద్ధతిలోకి వస్తాయి. బ్రెయిన్ వేవ్ యాక్టివిటీ క్రమ పద్ధతిలోకి వస్తే ఆలోచనలు నెమ్మదిస్తాయి, మనస్సు మీద నిగ్రహం వస్తుంది.. దీంతో నిగ్రహశక్తి పెరుగుతుంది.
ఇంత లోతైన ఫలితాలు ఉండేవి మంత్రాలు. రాయడానికి చాలా ఉంది. వీలువెంబడి ఇలాంటి లోతైన అవగాహన అందిస్తాను.
గమనిక: కాళీ మంత్రం మీ లోపల దాగి ఉన్న అన్ని నెగిటివ్ షేడ్స్ బయటకు (సబ్ కాన్షియస్ నుండి కాన్షియస్ కి) తీసుకు వస్తుంది. మెడిటేషన్ వంటి పూర్వ సాధన లేకుండా దీన్ని పఠించడం వల్ల ఆ శక్తిని తట్టుకోలేరు. కాబట్టి మొదట వీటిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి. మిగతా తర్వాత ప్రోగ్రెస్ కావచ్చు)
- నల్లమోతు శ్రీధర్