
Pakistan: పాకిస్థాన్లో ఉగ్రవాదుల నరమేదం ఇంకా కొనసాగుతోంది. దేశంలోని అంతర్గత కలహాలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయి. గత కొంతకాలంగా బలూచిస్థాన్(Balochistan) ఉద్యమం తీవ్రతరం కావడంతో అటు పాక్ సైన్యం, ఇటు ఉగ్రవాదులు ఆ ప్రాంతంపై దాడులు చేస్తున్నారు. ఈసారి ఉగ్రదాడులు ఓ స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు.
ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. అందులో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 38 మందికి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బలూచిస్థాన్ క్వెట్టా, కరాచీలోని ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. చికిత్స కొనసాగుతుండగా.. దీన్ని అక్కడి మంత్రులు ఖండించారు. దేశంలో అస్థిరత సృష్టించడానికి ఈ కుట్రలు జరుగుతున్నాయన్నారు. బడికి వెళ్తున్న బస్సును సూసైడ్ బాంబర్ కారు ద్వారా ఢీకొని దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే, ఈ దాడిని ఇప్పటివరకూ ఏ ఉగ్ర సంస్థ తమ పనిగా ప్రకటించుకోగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు.