
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) భద్రతా నిర్వహణలో కీలకమైన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ అధికారి(CV&SO) గా సీనియర్ ఐపీఎస్ అధికారి కేవీ మురళీ కృష్ణ నియమితులయ్యారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం 16వ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీ కృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. తితిదే చీఫ్ విజిలెన్స్ అధికారి పోస్టులో అదనపు బాధ్యతల్లో తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు కొనసాగుతున్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.