మంత్రం.. తంత్రం.. అస‌లేంటి నిజం?!

Share this article

తాంత్రికం.. అంటే చాలామందికి భయం. రకరకాల అపోహలు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఆధునిక భారతీయ సమాజానికి అందకపోవడం విచారించదగ్గ విషయం. సైంటిఫిక్‌గా మంత్రం, యంత్రం, తంత్రం వంటివి ఏంటి అని చాలా ఏళ్లుగా పరిశోధిస్తున్నాను, వీటిలో కొన్ని సాధనలు చేస్తున్నాను. ఇందులో భయపడేదేమీ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏర్పడే భయాలు.

వ్యాస‌క‌ర్త‌ ✍️
– నల్లమోతు శ్రీధర్
టెక్ గురు, లైఫ్ కోచ్‌

మొదట మంత్రం, యంత్రం, బ్రీఫ్‌గా చూశాక తంత్రం గురించి వివరంగా చెబుతాను. సాత్వికమైన దేవతలు, ఉగ్రరూపంలో ఉండే దేవతలు అని రెండు రకాలు ఉంటారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, గాయత్రీ దేవి వంటి దేవతలకు మనం చేసే పూజలు, మంత్రాలు సాత్విక స్వభావం కలిగినవి. భక్తియోగలో వీళ్లకి ఎక్కువ మన ప్రాముఖ్యత ఇస్తాం. మానసిక ప్రశాంతత కోసం ఈ దేవతలకు సంబంధించిన మంత్రాలు పఠించినా, పూజలు చేసినా మన ఎనర్జీ ఫీల్డ్‌లో చాలా సటిల్ (చాలా స్వల్పమైన, సున్నితమైన ఎనర్జీ మూమెంటమ్ జరుగుతుంది) మార్పులు వస్తాయి. అయితే చాలామంది నాన్-వెజ్ తినేవాళ్లు, మసాలాలు తినే వాళ్లకి అప్పటికే వాళ్ల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ విపరీతంగా స్టిములేట్ అయి ఉండడం వల్ల ఈ చిన్న చిన్న సాత్వికమైన మార్పులు పెద్దగా వాళ్లకి ఫలితాలు ఇవ్వవు. కేవలం సాత్వికాహారం, ప్రాణశక్తి ఎక్కువ అందించే మొలకలు వంటివి తినే వాళ్లకే సాత్విక దేవతల సాధనలు, మంత్రాలు ప్రస్ఫుటమైన మార్పు చూపిస్తాయి. మామూలు వాళ్లకి ఏళ్ల తరబడి సాధన చేయాలి.

ఉగ్రరూపాలు అయిన కాళికాదేవి, చిన్నమస్తా, బగలాముఖి, ధూమావతి, భైరవీ, ప్రత్యంగిరా దేవి వంటి దేవతల మంత్రాల్లోని భీజాక్షరాలు శరీరంలోని వివిధ చక్రాస్‌లో ముఖ్యంగా అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రాస్‌లో బ్లాకేజెస్ తొలగిస్తాయి. ఈ నాలుగు చక్రాస్ శరీరంలో పై భాగంలో ఉండేవి. ఒక్కసారిగా ఈ మంత్రాలు పఠించడం మొదలుపెట్టాక అప్పటి వరకూ కళ్ల దగ్గర ఉన్న ఎనర్జీ బ్లాకేజెస్ (థర్డ్ ఐ చక్ర బ్లాకేజెస్ అన్నీ కన్ను, కణతలు, నుదురు, మొహం చుట్టూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయి) క్లియర్ అవుతూ ఉండే కొద్దీ తలంతా హెవీగా అవడం, కళ్ల చుట్టూ మజిల్ అలసిపోవడం, కళ్ల చుట్టూ మ్యూకస్ మెంబ్రేన్స్ డ్రై అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని కూడా లోతుగా స్టడీ చేశాను. వాస్తవానికి ట్రిపుల్ వార్మర్ మెరీడియన్ అని TCM ప్రకారం ఉంటుంది.

శరీరంలోని నీరంతా శరీరంలో మూడు భాగాలుగా విస్తరించబడి ఉంటుంది. క్రింద భాగం ఎలిమినేషన్‌కీ, మధ్యలో భాగం నీరు డైజేషన్, మెటబాలిజంకీ, పై భాగంలో నీరు లంగ్స్, బ్రెయిన్ అవసరాలకు ఉపయోగపడతాయి. పై వార్మర్‌లోని నీరు మంత్ర సాధన వల్ల ఎనర్జీ ఫ్లో పెరిగి వేడి ఉత్పత్తి అయినప్పుడు త్వరగా ఆవిరైపోయి కళ్లు డ్రై అవుతాయి. ఇవన్నీ స్వయంగా నేను అనుభవించి రాస్తున్నవి. ఎక్కడో చదివినవి కాదు.. ఎన్నో సాధనలకు మొదట్లో భయపడి తర్వాత శరీరంలో ఏం జరుగుతోందో బయలాజికల్‌గా అర్థం చేసుకుని ఆ తర్వాత అన్ని అపోహలు తొలగించుకుని కొనసాగిస్తున్నాను. మొదట్లో ఈ ఉగ్రరూప మంత్ర సాధనలు చేసేటప్పుడు శరీరంలో పై చక్రాస్‌లో ఎనర్జీ చాలా తీవ్రంగా ఫ్లో అవుతుంది కాబట్టి కంట్రోల్డ్‌గా చేయాలి. గ్రౌండింగ్ లాంటివి చేయాలి. అంటే ప్రాణాయామం, నేలని తాకేలా చెప్పులు లేకుండా నడవడం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక ఈ క్రింది మూడు చక్రాస్ బ్లాకేజెస్ తొలగిపోయే కొన్నిసాధనలు చేయాలి. అప్పుడే మన ఎనర్జీ ఫీల్డ్ స్టెబిలైజ్ అవుతుంది.

ఉగ్రరూపాలను ఆరాధించడం తాంత్రిక సాధనల్లో ఓ భాగం. తంత్రంలో దక్షణాచారం, వామాచారం అని మళ్లీ రెండు రకాలుంటాయి. వామాచారంలో ఆల్కహాల్, మాంసాహారం, సెక్సువల్ టెక్నిక్స్ ద్వారా అద్వైతానికి చేరుకునే సాధనలు ఉంటాయి. కుంఢలినీ తంత్ర, శ్రీ విద్య తంత్ర (త్రిపుర సుందరిని ఆరాధించడం), అఘోరా తంత్ర (శ్మశానాల్లో సాధన) వంటివి అనేకం ఉంటాయి.

ఇక యంత్రానికి వస్తే.. అది సంపూర్ణంగా sacred geometry. అంటే విశ్వంలో ప్రతీ సృష్టీ ఫిబోనాసీ సీక్వెన్స్ రూపంలో (దీన్ని గోల్డెన్ రేషియో అంటారు) గానీ, స్పైరల్‌గా గానీ మేథమెటికల్‌గా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ ప్రకారం శ్రీ చక్రం అనే యంత్రాన్నే తీసుకుంటే అందులో క్రింది వైపు తిరిగి ఉండే ట్రయాంగిల్స్ ఒక మనిషి ఎనర్జీ ఫీల్డ్‌ని గ్రౌండింగ్ చేస్తాయి.. పై దిశగా ఉండే ట్రయాంగిల్స్ విశ్వానికి కనెక్ట్ చేస్తాయి. మధ్యలో ఉండే చుక్క ఏకత్వానికి దారి తీస్తుంది. ఇలా అనేక రకాల యంత్రాల ద్వారా కాస్మిక్ ఎనర్జీని ఆహ్వానించడం ఓ సాధన.

దీంట్లో తంత్రం పట్ల నాకు అందరిలాగే మొదట్లో భయం ఉండేది. ముఖ్యంగా నోటి నుండి బ్లడ్ వస్తున్నట్లు, మొహం భయంకరంగా ఉండే ఉగ్రరూపాల దేవతలను చూసినప్పుడు చాలామంది భయపడతారు. మొదట్లో నాకూ ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు సాధన చేశాక.. మన లేయర్స్ ఆఫ్ పర్సనాలిటీలో మూలాధార చక్రలో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నప్పుడు భయం, ఇన్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి… మూలాధార బ్యాలెన్స్ చేసుకుంటే ఇలాంటి భయాలన్నీ పోతాయన్నది.. మన రూపంలో చూస్తున్న భయం, మన ఎనర్జీ ఫీల్డ్‌లో ఉన్న భయం అనే బ్లాకేజ్‌తో రిసోనేట్ అవడం వల్ల జరుగుతుంది అన్నది అర్థమయ్యాక క్రింది చక్రాస్ బ్లాకేజెస్ క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది. అహం జయించిన వ్యక్తులకు తాంత్రికమైన ప్రాక్టీసెస్ మరింత అద్భుతంగా పనిచేస్తాయి. అహంతో ఉన్న వ్యక్తులకు, క్రింది మూడు చక్రాస్ బ్లాకేజెస్ ఉన్న వారు ఖచ్చితంగా గ్రౌండింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ వీటిని చేయాలి.

అంతే తప్పించి దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. ఒకటే విషయం.. కాస్మిక్ ఎనర్జీని, భీజాక్షరాల ద్వారా నాడులు, చక్రాస్‌లో ఉండే ఎనర్జీ బ్లాకేజెస్‌ని తొలగించుకోవడానికి వివిధ మార్గాలు ఎంచుకుంటున్నా తప్పించి అవి మన కేంద్రీయ నాడీ వ్యవస్థని స్టిములేట్ చేస్తాయి తప్పించి భయం నుండి, అజ్ఞానం నుండి ఏదీ చూడడం సరైనది కాదు.

– నల్లమోతు శ్రీధర్

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *