
Amaravathi: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలిసారిగా ఏపీకి కర్ణాటక నుంచి సుశిక్షిత కుంకీ ఏనుగుల(Kumki elephants)ను రప్పిస్తున్నారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే కీలక నిర్ణయాలు, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలతో ఆ శాఖలో మార్పునకు నాంధి పలుకుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలోని పలు జిల్లాల్లో ఏళ్లుగా అడవి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రైతులు, స్థానికులపై దాడులు చేయడంతో పాటు పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీ శాఖ వద్ద సమాధానం లేదు. తాత్కాలిక ఉపశమనంగా భారీ శబ్ధాలు, ఇటువైపు రాకుండా అడవిలోనే వివిధ ఏర్పాట్లు చేసినా ఏదీ సఫలం కాలేదు. దీంతో ఏకైక పరిష్కారం కుంకీ ఏనుగులేనని భావించిన ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వాటి గురించి ఆరా తీశారు. కర్ణాటక(Karnataka) ప్రభుత్వ అటవీ శాఖ వద్ద ఇవి ఉన్నట్లు తెలుసుకున్న ఆయన.. స్వయంగా అక్కడి అటవీ శాఖ మంత్రితో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో మాట్లాడారు. పవన్ చొరవతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అటవీ సంపద పెంపు, రక్షణ అంశాలపై ఇటీవలె ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా అక్కడి సుశిక్షిత కుంకీ ఏనుగులను ఏపీకి తరలించేందుకు కర్ణాటక సర్కారు ఒప్పుకుంది.

ఈనెల 21న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Dy CM DK Shivakumar)ల సమక్షంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ అధికారులు 6 కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకురానున్నారు. ఈ ఏనుగులు అడవి ఏనుగుల్ని కట్టడి చేయడంతో పాటు పంట, ప్రాణాల రక్షణకు సాయం కానున్నాయి. రేపే కర్ణాటక ప్రభుత్వం వీటిని అధికారికంగా ఏపీకి అప్పగించనుంది. పక్క రాష్ట్రంలో ఎన్డీఏయేతర సర్కారు ఉన్నా.. ఎలాంటి బేషజాల్లేకుండా ఈ కీలక ఒప్పందం జరిగేందుకు చొరవ చూపిన పవన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.