ఇంట‌ర్‌తో ఇండియన్ ఆర్మీ ఆఫీస‌ర్ ఉద్యోగాలు!

Share this article

Delhi: భార‌త సైన్యం(Indian Army)లో చేరేందుకు ఉత్సుక‌త ఉన్న యువ‌త‌కు స‌ర్కారు శుభ‌వార్త చెప్పింది. ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసి, జేఈఈ ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థుల కోసం Indian Army టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్(Technical Entry Scheme) నియామ‌కాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 90 పోస్టుల‌కు భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుండ‌గా.. ఎంపికైన అభ్య‌ర్థులు భార‌త సైన్యంలో ఆఫీస‌ర్ హోదాలో వివిధ విభాగాల్లో ప‌నిచేయనున్నారు. ఈ అధికారుల నెల‌ జీతం రూ.2ల‌క్ష‌ల(Rs.2Lakh per Month) వ‌ర‌కు ఉంటుంది.

అర్హ‌త‌: ద‌ర‌ఖాస్తు చేసేందుకు అభ్య‌ర్థులు ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ఎంపీసీలో క‌నీసం 60శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు జేఈఈ (మెయిన్స్‌) 2025 ప‌రీక్ష‌ల‌కు హాజ‌రై ఉండాలి.

వయో పరిమితి: అభ్య‌ర్థుల క‌నీస వ‌య‌సు 16 సంవ‌త్స‌రాలు. గ‌రిష్ఠ వ‌య‌సు 19 సంవ‌త్స‌రాలు. 2 జూలై 2006కి ముందు, 1 జూలై 2009 త‌ర్వాత పుట్టి ఉండ‌కూడ‌దు.

ద‌ర‌ఖాస్తుకు కావాల్సిన స‌ర్టిఫికేట్లు:

  1. ఎస్ఎస్సీ మెమో
  2. ఇంట‌ర్మీడియ‌ట్ మెమో (10+2)
  3. ఆధార్ కార్డు
  4. JEE మెయిన్స్ ఫలితం 2025 కాపీ

ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలంటే..?

  • అభ్య‌ర్థులు భార‌త ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ను సంద‌ర్శించి ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తుకు ముందు అధికారిక నోటిఫికేష‌న్ లో ఇచ్చిన అర్హ‌త‌లు త‌నిఖీ చేసుకోవాలి.
  • హోమ్ పేజిపై ఇచ్చి ద‌ర‌ఖాస్తు లింక్ ద్వారా మీ వివ‌రాలు న‌మోదు చేసుకోవాలి.
  • లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ద్వారా లాగిన్ అయి ద‌ర‌ఖాస్తు ఫారం పూర్తి చేయాలి.
  • ద‌ర‌ఖాస్తు చేసిన ఫారం ముందే ప్రింట్ తీసి పెట్టుకోవ‌డం ఉత్త‌మం.

ద‌ర‌ఖాస్తు తేదీలు: 13 మే 2025 నుంచి 12 జూన్ 2025 వ‌ర‌కు.

ఆల్ ది బెస్ట్‌!

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *