
Hyderabad: రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ(Konda Surekha) వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) స్పందించారు. మంత్రుల తమ వద్దకు ఫైల్ వస్తే ముందుకు కదిలేందుకు కమీషన్ తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ ఓ కార్యక్రమంలో మాట్లాడిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓ కమీషన్ ప్రభుత్వంగా మారిందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనన్నారు. నిజం ఒప్పుకున్నందుకు మంత్రికి హృదయపూర్వక అభినందనలు చెప్పిన ఆయన.. ఈ 30% కమీషన్ సర్కారులో మంత్రులంతా కమీషన్ లేకుంటే ఫైళ్లపై సంతకాలు చేయరట అంటూ రాసుకొచ్చారు. ఇటీవలె కాంట్రాక్టర్లు సచివాలయం వద్ద ధర్నా చేయడంతో ప్రభుత్వ కమీషన్ వ్యవస్థ మొత్తం బయటపడిందన్న ఆయన.. మిగతా మంత్రులు, లోపాలను దయచేసి బయటపెట్టాలంటూ మంత్రి సురేఖను కోరారు. దీనిపై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్పందిస్తారా..? మంత్రులపై విచారణ చేపడతారా అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు.
