
Mumbai: నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), దర్శక దిగ్గజం రాజమౌళి(Rajamouli) మరోసారి జట్టుకట్టనున్నారు. ఆర్ఆర్ఆర్(RRR), దేవర(Devara) సినిమాల విజయాలతో ఊపు మీదున్న తారక్.. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్-2(War-2)లో నెగటీవ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలుండగా.. ఇప్పుడు మరో సినిమా కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమ పితామహుడు దాదా సాహేబ్ పాల్కే జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ ఫాల్కే పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. జక్కన్న సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. మేడ్ ఇన్ ఇండియాగా(Made in India) సినిమాకు ఇప్పటికే పేరు ప్రచారంలో ఉండగా.. ఇంగ్లీష్‌తో పాటు ఆరు భారతీయ భాషల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సైమా అవార్డ్స్ సంస్థ ఈ విషయాన్ని ఎక్స్ వేధికగా ధృవీకరించగా.. ఇక బాక్సాఫీస్ బద్దలు ఖాయమంటూ, ఆస్కార్(Oscar) ఖచ్చితంగా వచ్చేస్తుందంటూ జూనియర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.