
Hyderabad: టాలీవుడ్ హీరో, నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) పై కేసు నమోదైంది. ట్రాఫిక్‌లో తప్పుడు మార్గంలో వచ్చిన శ్రీనివాస్‌ను అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఒకరు ఆపారు. శ్రీనివాస్ అదే మార్గంలో వెళ్లే ప్రయత్నం చేసినా.. వెళ్లనీయకుండా ఆపిన కానిస్టేబుల్‌పైకి దురుసుగా మాట్లాడిన శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా.. ట్రాఫిక్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రూల్స్ అతిక్రమించినందుకు హీరోపై గురువారం కేసు నమోదు చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ యూటర్న్ వద్ద నిన్న జరిగిందీ ఘటన.