
Balochistan: పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. పూర్థి స్థాయి దేశంగా ఆవిర్భవించేందుకు చకచకా ఏర్పాట్లు చేసేసుకుంటోంది. ఇప్పటికే ఆ దేశ పార్లమెంటు భవనం, పార్టీలు, అధికారిక జెండా, జాతీయ గీతం, జాతీయ చిహ్నాల్ని బలూచిస్థాన్ ఉద్యమ నాయకులు ప్రకటించారు. తాజాగా ఆ దేశ క్రికెట్ టీం గురించి చర్చ మొదలైంది. బలూచిస్థాన్ వేర్పాటు ఉద్యమ నేత, ఫ్రీ బలూచిస్థాన్ పార్టీ నాయకుడు మీర్ యార్ బలోచ్ భారత్ గురించి ఎక్స్(X)లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

అక్కడి మైదానం ఫోటోను జతచేస్తూ త్వరలోనే భారత్ బలూచిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండబోతుందంటూ ప్రకటించారు. అయితే, దీనికి మద్దతుగా అక్కడి బలూచిస్థాన్ పౌరులతో పాటు ఇండియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వేర్పాటు ఉద్యమం మొదలు నుంచి భారత్ బలూచిస్థాన్‌కు వెంట నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మధ్య బలూచిస్థాన్ ఉద్యమం తీవ్రతరం కావడంతో పాటు, దేశంగా ఆవిర్భవించేందుకు భారత ప్రభుత్వంతో పాటు ఆఫ్ఘన్ ప్రభుత్వాలు దన్నుగా నిలుస్తున్నాయనే అక్కసుతోనే పాక్‌పై దాడికి పూనుకున్నట్లు అనధికార వార్తలు అక్కడి మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. (India vs Balochistan Cricket Match)