మొద‌లైన పాక్‌ ఫేక్ గేమ్స్‌!

Share this article

శ్రీన‌గ‌ర్ ఎయిర్ బేస్‌పై దాడి అంటూ త‌ప్పుడు ప్ర‌చారం

India-Pakistan: దాయాది పాకిస్థాన్ మ‌రోసారి ఫేక్ గేమ్స్ మొద‌లుపెట్టింది. క‌శ్మీర్ లో ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా మంగ‌ళ‌వారం అర్ధరాత్రి భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌(Operation Sindoor)పై పాక్ విషం క‌క్కుతోంది. తీవ్ర‌వాదుల స్థావ‌రాల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసుకుని సాగిన ఈ ఆప‌రేష‌న్‌లో.. జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా లాంటి అతి తీవ్ర‌వాద సంస్థల స్థావ‌రాల్లో మాత్ర‌మే భార‌త వైమానిక ద‌ళాలు విధ్వంసం సృష్టించి.. పెద్ద సంఖ్య‌లో తీవ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టాయి. అయితే, ఇక్క‌డ జ‌రిగిన దాడుల్లో పాకిస్థాన్ పౌరులే ల‌క్ష్యంగా దాడి జ‌రిగింద‌ని పాకిస్థాన్ ఫేక్ ప్ర‌చారం మొద‌లుపెట్టింది. స్థానికులు మ‌ర‌ణించార‌ని.. తీవ్ర గాయాల‌య్యాయ‌ని సామాజిక మాధ్య‌మాల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. భార‌త్ చేసిన దాడికి పాక్ ఆర్మీ గ‌ట్టిగా బ‌దులిచ్చిందంటూ కొన్ని వార్త‌ల‌ను అక్క‌డి పౌరులు ప్ర‌చారం చేస్తున్నారు. శ్రీన‌గ‌ర్ ఎయిర్ బేస్‌(Srinagar Airbase) పై పాకిస్థాన్ దాడి చేసింద‌ని.. బ్రిగేడియ‌ర్ హెడ్ క్వార్ట‌ర్ బూడిదైందంటూ కొన్ని వీడియోల‌ను పోస్ట్ చేస్తోంది. అయితే ఇవ‌న్నీ ఫేక్ అని ఇండియ‌న్ ఆర్మీ తేల్చింది. భార‌తీయులెవ‌రూ ఈ త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని కోరింది.

భార‌త్ దాడి స‌మ‌యంలోనూ పూంచ్ సెక్టార్ ప‌రిధిలోని ఎల్వోసీ నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద పాకిస్థాన్ సైనికులు కాల్పులకు పాల్ప‌డిన‌ట్లు ఆర్మీ ప్ర‌క‌టించింది. ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌క‌పోగా.. తిరిగి మ‌న సైనికులు గ‌ట్టిగా బ‌దులిచ్చార‌ని పేర్కొంది. అయితే, గ‌త వారం రోజులుగా ఎల్వోసీ స‌రిహ‌ద్దు రేఖ‌ను ఆనుకొని త‌ర‌చూ ఓ చోట పాకిస్థాన్ ఆర్మీ, భార‌త సైనికుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డుతూ క‌వ్విస్తోన్న విష‌యం తెలిసిందే.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *