
India-Pakistan: కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి(Terror Attack) ప్రతీకారంగా భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్‌పై(Operation Sindoor) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. వైట్ హౌజ్ లో జరుగుతున్న ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఇప్పుడే ఈ గదిలోకి వస్తుంటే ఈ విషయం తెలిసింది. ఇది ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య. దీనికి ఒకటి రెండు రోజుల్లో సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నా అంటూ భారత్ కు మద్దతుగా మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాలపై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
